4, మే 2022, బుధవారం

" ఆచార్య " సినిమా పై నా అభిప్రాయం !!!

సైరా నర్సింహ రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి నుండి దాదాపు 3 సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ కూడా నటించిన సినిమా ఆచార్య ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ధర్మ స్థలి అనే ఊరిలో ఘట్టమ్మ అనే దేవత ఉండేది ఆ ప్రాంత ప్రజలు ఆ ఊరిలో ఆ దేవతను చాలా భక్తితో పూజించేవారు అయితే అక్కడే బసవ అనే ఒక విలన్ వాళ్ళు అందరిని భయపెట్టి ఆ ప్రాంతాన్ని అక్రెమించి ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అయితే అక్కడ దగ్గర ఉన్న పాదఘట్టం అనే ప్రాంతంలో కొందరి ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ధర్మ స్థలి లో ఎవరికి ఏ అనారోగ్యం చేసిన వారిని తమ మందులతో బాగు చేసేవారు అందులో ఉండే ఒక అబ్బాయి రామ్ చరణ్ సిద్ద పాత్రలో చేసాడు గుడిని ఆక్రమించాలని చూసే వారికి ఎదురు తిరిగి నిలబడే వాడు అయితే సిద్ద కనబడకుండా పోవటం ఆ ధర్మ స్థలి లో బసవ ఆగడాలుయూ ఎక్కువ అవ్వటంతో ఆచార్య అక్కడకు వెళ్తాడు వాళ్ళను ,అక్కడ జరిగే అన్యాయాలు ను ఎదురు తిరుగుతాడు చివరకు ధర్మ స్టాలిని విలన్ నుండి కాపాడతాడు 

అయితే అసలు సిద్ద ఏమయ్యాడు అసలు సిద్ద కి, ఆచార్య కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ భారీ అంచనాలతో సినిమా చూసిన ప్రేక్షకుడి కి నిరాశే మిగిలింది అని చెప్పాలి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు just average అంటే సినిమా !!!

2 కామెంట్‌లు:

  1. ఒక పెద్ద పేరు తెచ్చుకున్న వయసైపోయినా ఆమాట ఒప్పుకోలేని హీరో, ఆహీరో కొడుకు కాబట్టి తనూ హీరోగా సినీరంగాన్ని ఏలటానికి వచ్చిన ప్రతిభను ఆపాదించబడిన ముసలిహీరోగారి పుత్రరత్నమూ కలసి నటించిన సినిమాకి పేరుకు మాత్రం దర్శకుడిగా మిగిలిపోతానని తెలియక రంగంలోనికి దిగి దెబ్బతిన్న ఒక పేరుమోసిన దర్శకుడూ కలిసి వండిన సినిమాలో అంతా ఆ తండ్రీకొడుకులే చేతనైనట్లు గొప్పగా దున్నేస్తే దంపినమ్మకు బొక్కిందే కూలి అన్నట్లుగా తయారైనా కళాఖండాన్ని చచ్చినట్లు ఆదరించటానికి సినీప్రేక్షకులకు ఏమన్నా పిచ్చి అనుకున్నారా? చేసుకున్నవారికి చేసుకున్నంత అని అనుభవించవలసిందే. ఇంత చేదును జనం ఆతండ్రీకొడుకులకు తినిపించినా వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి కళాఖండాలను తయారు చేస్తూనే పోతారు. నిర్మాతలే బకరాలు అవుతారు !

    రిప్లయితొలగించండి
  2. దాందేముందిలేండీ. అద్భుతమైన హీరోలు ఎంతమందున్నా.. ఎకిలి హీరోయిజం చూపించిన "ఎన్‌టీఆర్ మాత్రమే విశ్వవిఖ్యాత కథానాయకుడు.. అంతకంటే గొప్పోడున్నాడంటే ఒప్పుకోం" అనే అభిమాన దురంధురలున్న తెలుగు జాతిమనది.

    రిప్లయితొలగించండి

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...