Natural స్టార్ నాని నటించిన తాజా చిత్రం " అంటే సుందరానికి" ట్రైలర్ glimse విడుదల చేసారు చిత్ర unit మీరు ఒక లుక్ వేయండి ట్రైలర్ కూడా ఎప్పుడూ విడుదల అవుతుంది చూడండి !!!
30, మే 2022, సోమవారం
28, మే 2022, శనివారం
ఆహా లో విడుదల ఆయున " writer" సినిమా పై నా అభిప్రాయం !!!
అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పని చేస్తుంటాడు సంద్రఖని కింది స్థాయి పోలీస్ లకు ఒక union అంటూ ఉండాలని పోరాటం చేస్తూ ఉంటాడు అయితే అది తన పై అధికారులకు నచ్చదు తనని ఎలాగైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు ట్రాన్స్ఫర్ చేస్తారు కూడా అయితే అక్కడి నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు
అయితే అక్కడ ఒక రైటర్ గా కాకుండా మాములు పోలీస్ కానిస్టేబుల్ లాగా డ్యూటీ లో వేస్తారు అయితే అక్కడ ఒక కుర్రోడిని అరెస్ట్ చేసి రహస్యంగా ఉంచుతారు అక్కడ సముద్ర ఖని ని కాపాలకు ఉంచుతారు అసలు ఆ కుర్రోడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ కుర్రాడి కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని తమిళ్ లో ఎక్కువుగా పోలీస్ వాళ్ళు చేసే పనులు గురించే సినిమాలు ఎక్కువుగా వస్తున్నాయి బాగానే ఉంది సినిమా పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!
27, మే 2022, శుక్రవారం
" F3 " సినిమా పై నా అభిప్రాయం !!!
దాదాపు మూడు సంవత్సరాలు క్రితం అనుకుంటా f2 సినిమా వచ్చి దాని తరువాత దాని పార్ట్ 2 అదే seqel ఇప్పుడు వచ్చింది ఈ సినిమా ఇవాళ విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా మొత్తం డబ్బు గురించే ఉంటుంది డబ్బు కోసం చాలా వ్యాపారాలు చేసి మోసపోతుంటాడు వెంకీ, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా పెద్ద కోటీశ్వరుడు అని ఫీల్ అవుతుంటాడు వరుణ్ హీరోయిన్స్ ఫ్యామిలీ కూడా F2 లో ఉండే characters ఇందులో ఉన్నారు వాళ్ళు కూడా డబ్బు కోసం హోటల్ నడుపుతుంటారు ఇది ఇలా సాగుతుండగా వీళ్లందురు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు అయితే అప్పుడే ఒక పెద్దాయన తప్పి పోయిన తన కొడుకు కోసం ప్రకటన చేస్తాడు అది చూసి వీళ్లందురు ఆ పెద్దాయన ఇంట్లోకి మకాం మారుస్తారు ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
అనిల్ రావిపూడి సినిమాలు కథ ఎలా ఉన్నా కామెడీ ఒక పరంగా బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అతి కామెడీ ఎక్కువగా వెగటు కల్పిస్తుంది ఏదైతేనేం కామెడీ ఇష్టపడేవారికి ఈ సినిమా పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు బాగానే ఉంది కాని F2 ఎలా అయితే ఉందొ ఈ సినిమా దానికి తగ్గట్టు అలానే ఉంటుంది !!!
21, మే 2022, శనివారం
అంతర్జాతీయ టీ దినోత్సవం !!!
మే 21 ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం ఎందుకంటే వాట్సాప్ లో ఎవరో ఫ్రెండ్ స్టేటస్ పెడితే చూసాను ఎందుకో మనం తీసుకునే ప్రతి పదార్దానికి ఒకో రోజు ఉంటే బాగుండును
నేను కొత్తగా వింటున్నాను బాగుంది కదా టీ దినోత్సవం టీ అంటే కొంతమందికి అది లేకపోతే ఒక గంట ఉండలేరు టీ ప్రియులు అందరికి టీ దినోత్సవం శుభాకాంక్షలు !!!☕☕☕
"శేఖర్ " సినిమా పై నా అభిప్రాయం !!!
రాజ శేఖర్ హీరోగా తన భార్య జీవిత డైరెక్షన్ లో వచ్చిన సినిమా శేఖర్ నిన్న అనగా మే 20 తేదీన విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక రిటైర్డ్ పోలీస్ అయితే అతడు క్రిమినల్స్ ని పట్టుకోవడం లో తన తెలివి తేటలతో చాలా కేస్ లు సాల్వ్ చేస్తాడు తనకు ఒక భార్య, కూతురు ఉంటారు కొన్ని కారణాల వల్ల భార్యకు దూరంగా ఉంటాడు కూతురితో కలిసి జీవిస్తాడు అయితే అనుకోకుండా తన భార్య ప్రమాదంలో మరణిస్తుంది
కొన్ని రోజుల తరువాత తన కూతురు కూడా ప్రమాదం వల్ల మరణిస్తుంది తన భార్యని, కూతురు same ప్రమాదంలో మరణించటం కొంచెం అనుమానంగా అనిపిస్తుంది
ఇక ఈ కేస్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అయితే చివరకు అసలు అది హత్యల, లేక ప్రమాదంగా ఎందుకు చేశారు చివరకు ఎలా కథ ముగిసింది అన్నది సినిమా కథ !!!
20, మే 2022, శుక్రవారం
Ntr birthday surprise కొరటాల శివ మూవీ ఫస్ట్ glimps చూసారా ?
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ,కొరటాల శివ direction లో వస్తున్న తాజా చిత్రం ఫస్ట్ glimps విడుదల చేసారు మీరు ఒక లుక్ వేయండి !!!
"Snake" సినిమా పై నా అభిప్రాయం !!!
ఇందులో హీరో ఒక బయాలజీ టీచర్ అయితే తన భార్య క్యాన్సర్ తో చనిపోతుంది తనకు ఒక చిన్న పాపా కూడా ఉంటుంది అయితే తనకు కూడా కాన్సర్ బారిన పడుతుంది అయితే తన అనుభవంతో ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకంలో ఒక అడవిలో ఒక రకమైన పువ్వు ఉంటుంది దానితో క్యాన్సర్ న్నీ అరికట్టవచ్చును అని ఉంటుంది
అయితే అది తెలుసుకుని ఒక బిసినెస్ మెన్ తనను వెతుక్కుంటూ హీరో ఇంటికి వస్తాడు అయితే ఆ పువ్వు ని తనకు తెచ్చి ఇవ్వటంలో తనకు సహాయం చేస్తే తన పాపకు ట్రీట్మెంట్ చేస్తానని చెబుతాడు
తన పాపా కోసం తాను ఆ ఆడివిలోకి వెళ్తాడు ఆ అడివి కొంచెం విచిత్రం గా ఉంటుంది అందులో పెద్ద పాములు రెండు ఉంటాయి అయితే చివరకు ఏమి జరిగింది అన్నది కథ !!!
ADeventure సినిమాలు ఇష్టపడేవారు ఒక సారి చూడ వచ్చు !!!
12, మే 2022, గురువారం
" సర్కారు వారి పాట " సినిమా పై నా అభిప్రాయం !!!
ఇందులో హీరో చిన్నప్పుడే వాళ్ళ తల్లి తండ్రిని కోల్పోతాడు వాళ్ళ మాస్టర్ ఒక అనాధ సరణాలయం లో జాయిన్ చేస్తాడు అక్కడి నుండి హీరో ఫారెన్ కంట్రీ లో ఫైనాన్స్ కంపెనీ లో రికవరీ లో చేస్తాడు అడిగిన వారికి అప్పు ఇవ్వటం మరల దానిని ముక్కుపిండి వసూలు చేయడం ఇదే పని హీరోది ఇలా కథ ముందుకు సాగుతుండగా
అక్కడే హీరోయిన్ తాగుడు, కేసినోకి అలవాటు పడి హీరో దగ్గర అప్పు చేస్తుంది హీరో కూడా ఎంత అడిగితే అంత అప్పు ఇస్తాడు ఎందుకంటే హీరో హీరోయిన్ ని ఇష్టపడతాడు కాబట్టి అయితే చివరకు తన డబ్బులు తనకు కట్టమని హీరో అడుగుతాడు కానీ హీరోయిన్ డబ్బులు అసలు ఇవ్వనని చెబుతుంది
అయితే ఆ ఆ డబ్బులు వసూలు చేసుకోవటానికి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఇండియా కి వస్తాడు అయితే ఆ తరువాత కథ ఏమిటి చివరికి డబ్బులు వసూలు చేసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ !!!
9, మే 2022, సోమవారం
" అశోక వనంలో అర్జున కల్యాణం " సినిమా పై నా అభిప్రాయం !!!
విశ్వక్ సేన్ హీరోగా చేసిన సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!
తెలంగాణలో సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు హీరో అయితే అప్పటికే 30 సంవత్సరాలు దాటి పోతాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు అయితే అది గోదావరి జిల్లాలో ఒక పెళ్లెటూర్లో ఉండే ఒక కుటుంబం లోని హీరోయిన్ తో నిశీతార్థం చూడటానికి వెళ్తాడు అయితే అక్కడ అప్పుడే లోక్డౌన్, జనతా క్యూర్ఫు వంటివి విధించడం వల్ల అనుకోని పరిస్థితుల్లో అక్కడే హీరో తన బంధువులతో ఉండాల్సి వస్తుంది
ఇంతకీ ఆ తరువాత కథ ఏమిటి ఎలా ముందుకు సాగింది అన్నది సినిమా కథ బాగానే ఉంది ఒక సారి ఫ్యామిలి తో చూడ వచ్చు !!!
7, మే 2022, శనివారం
కీర్తి సురేష్ " చిన్ని" సినిమా పై నా అభిప్రాయం !!!
ఇది ఒక పేద కులంలో పుట్టిన ,పేరు పలుకుబడి ఉన్న కుటుంబంలో పుట్టిన వారికి జరిగే కథ ఇందులో కీర్తి ఒక పేద కులంలో పుట్టి తన భర్తని, కూతుర్ని పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది అయితే వాళ్ల భర్త పనిచేసే రైస్ మిల్ లో చిన్న గొడవ జరుగుతుంది తక్కువ కులం అని చెప్పి అతడిని హేళన చేస్తూ ఉంటారు యజమానులు అయితే వాళ్ళతో గొడవ పడి ఉద్యోగం మానేస్తాడు అయితే మరలా వెళ్లి బతిమాళితే తన భార్య గురించి తప్పుగా మాట్లాడుతారు
ఆ గొడవ పెద్దయి చివరకు వారిని చంపే వరుకు వెళ్తుంది కీర్తి ఇందులో చిన్ని పాత్రలో చేస్తుంది తనని ఒక చోటకీ రమ్మని తన మీద రేప్ చేస్తారు చాలా చిత్ర హింసలు పెడతారు తన భర్తని, కూతుర్ని బ్రతికుండగానే ఇంటిలో కిరోసిన్ పోసి కాలేచేస్తారు
అయితే వాళ్ళ మీద చిన్నీ ఎలా పగ తీర్చుకుంది సెల్వ రాఘవన్ కి చిన్ని ఏమిటి సంబందం అన్నది మిగతా కథ పగ, ప్రతికారాలు చుట్టూ తిరుగుతుంది కథ అంతా హింస చాలా ఎక్కువుగా ఉంది సినిమాలో రొటీన్ సినిమాల కాకుండా హింస తో కూడిన సినిమా !!!
4, మే 2022, బుధవారం
" ఆచార్య " సినిమా పై నా అభిప్రాయం !!!
ధర్మ స్థలి అనే ఊరిలో ఘట్టమ్మ అనే దేవత ఉండేది ఆ ప్రాంత ప్రజలు ఆ ఊరిలో ఆ దేవతను చాలా భక్తితో పూజించేవారు అయితే అక్కడే బసవ అనే ఒక విలన్ వాళ్ళు అందరిని భయపెట్టి ఆ ప్రాంతాన్ని అక్రెమించి ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అయితే అక్కడ దగ్గర ఉన్న పాదఘట్టం అనే ప్రాంతంలో కొందరి ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ధర్మ స్థలి లో ఎవరికి ఏ అనారోగ్యం చేసిన వారిని తమ మందులతో బాగు చేసేవారు అందులో ఉండే ఒక అబ్బాయి రామ్ చరణ్ సిద్ద పాత్రలో చేసాడు గుడిని ఆక్రమించాలని చూసే వారికి ఎదురు తిరిగి నిలబడే వాడు అయితే సిద్ద కనబడకుండా పోవటం ఆ ధర్మ స్థలి లో బసవ ఆగడాలుయూ ఎక్కువ అవ్వటంతో ఆచార్య అక్కడకు వెళ్తాడు వాళ్ళను ,అక్కడ జరిగే అన్యాయాలు ను ఎదురు తిరుగుతాడు చివరకు ధర్మ స్టాలిని విలన్ నుండి కాపాడతాడు
అయితే అసలు సిద్ద ఏమయ్యాడు అసలు సిద్ద కి, ఆచార్య కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ భారీ అంచనాలతో సినిమా చూసిన ప్రేక్షకుడి కి నిరాశే మిగిలింది అని చెప్పాలి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు just average అంటే సినిమా !!!
1, మే 2022, ఆదివారం
విజయ్ సేతుపతి "KRK" సినిమా పై నా అభిప్రాయం !!!
విజయ్ సేతుపతి తమిళ్ లో మంచి పేరున్న హీరో ఇక ఈ మధ్య విడుదల అయిన krk సినిమా విజయ్ సేతుపతి, నయన తార, సమంత హీరో హీరోయిన్ గా విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా ఇక కథ ఏమిటో చూద్దాం !!!
ఇందులో హీరో తన చేసే ప్రతి పనీ తనకు కలిసి రావటం లేదని తానొక నష్ట జాతకుడు గా అనుకుంటుంటాడు అందుకు తాను పుట్టిన ఊరు నుండి తన తల్లి దగ్గరి నుండి దూరం అవుతాడు చిన్న చిన్న పనులు డ్రైవర్ గా ఇలా జీవనం సాగిస్తాడు తనకు 30 సంవత్సరాలు దాటిపోతున్న సంసారం అన్నా చట్రంలో ఇరుక్కోకుండా ఉంటాడు అయితే అప్పుడే వీరిద్దరూ పరిచయం అవుతారు
వీరిద్దరూ పరిచయం అయిన తరువాత తన జీవితం అదృష్టం వరించినదని భావిస్తాడు అయితే అనుకోకుండా ఇద్దరు తనని ప్రేమిస్తున్నాని చెబుతారు
అయితే హీరో చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చివరకు ఏమైంది అన్నది మిగిలిన కథ !!!
Ponman సినిమా పై నా అభిప్రాయం !!!
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...