6, మార్చి 2023, సోమవారం

" The great Indian kitchen Review సినిమా పై నా అభిప్రాయం !!!

 

ఈ సినిమా మలయాళం సినిమా దీనిని తమిళ్, తెలుగు,కన్నడంలో రీమేక్ చేశారు ఈ సినిమా జీ5 ott లో అందుబాటులో ఉంది సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం 
ఇందులో ఐశ్వర్య రాజేష్, రాహుల్ రామ చంద్రన్ ప్రముఖ పాత్రలో చేశారు ఇందులో హీరోయిన్ స్వతంత్ర భావాలు కల్గిన వ్యక్తి అయితే రాహుల్ కి తనకి పెళ్లి జరుగుతుంది పెళ్లి అయినప్పటి నుండి తన జీవితం వంట గదికే పరిమితం అవుతుంది వాళ్ళది చాలా చాదస్తపు కుటుంబం వాళ్ళ మామ గారికి వంట కట్టెల పొయ్య మీద చేయాలి చేతితోనే చట్నీలు, చేయాలి వాళ్ళ అత్తగారు తను కలిసి కిచెన్ లో పనిచేసుకుంటూ ఉండేవారు అయితే అత్తగారి కూతురికి డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో అక్కడికి వెళ్తుంది ఇంటి పని మొత్తం కోడలి పైనే పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కొంది అన్నది మిగిలిన కథ 
సాధారణంగా ప్రతి ఇంటిలో జరిగే పరిణామాలు ఆడవాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు అన్నది సినిమా కథ మధ్యలో కొద్దిగా వంట గది అస్తమానూ చూపించడంతో బోర్ గా ఉంది కానీ మొత్తానికి బాగుంది సినిమా నిడివి కూడా తక్కువే 1 గంట 30 నిమిషాలు లోపే ఉంది సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!