8, మార్చి 2023, బుధవారం

బలగం సినిమా పై నా అభిప్రాయం !!!

 జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో వచ్చిన సినిమా బలగం సినిమా దిల్ రాజు నిర్మాణం లో వచ్చిన సినిమా ప్రియదర్శి హీరో గా వచ్చిన సినిమా మార్చ్ 3 న విడుదల అయింది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

అది తెలంగాణ లో ఒక మారుమూల పల్లెటూరు హీరో కి పెళ్లి కుదురుతుంది వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తాడు అది దెబ్బతింటుంది దానితో ఊరిలో ఒకరి దగ్గర అప్పు చేస్తాడు వాళ్ళు ఆ అప్పు తీర్చమని అడుగుతారు తనకు పెళ్లి ఖాయమైంది అని తన పెళ్ళికి 15 లక్షలు కట్నం వస్తుంది అని అది రాగానే అప్పు తీర్చేస్తనని చెబుతాడు అయితే ఉన్న పళంగా వాళ్ళ తాత చనిపోతాడు 

అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది హీరో తన పెళ్లి అవదని ఆ అప్పు ఎలా తీర్చాలని అలోచిస్తాడు వాళ్ళ తాత చావుకు పలకరించటానికి హీరో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది కానీ అక్కడ చిన్న గొడవ జరిగి పెళ్లి cancel అవుతుంది అప్పుడు హీరో వాళ్ళ మేనత్త వాళ్లు కూడా వస్తారు వాళ్లకు ఒక కూతురు ఉంటుంది వాళ్ళ మేనత్త కూతురు నీ పెళ్లి చేసుకుంటే తన అప్పు తీరుతుందని అలోచిస్తాడు కానీ వాళ్ల మావయ్యకి వాళ్ళ నాన్నకి గొడవలు జరిగి అసలు తన పుట్టింటికి వచ్చి దాదాపు 20 సంవత్సరం లు అవుతుంది వాళ్ళ నాన్న కి మావయ్య కి గొడవలకు అసలు కారణం ఏమిటి హీరో ఇటువంటి పరిస్తితి లో ఏమి చేశాడు అన్నది కథ 

చాలా బాగుంది సినిమా ఒక మరణం కూడా విడిపోయిన కుటుంబాలను, బంధాలను ఎలా కలిపింది అన్నది బాగా చూపించాడు  మొత్తానికి బాగుంది సినిమా చూడ వచ్చు చిన్న సినిమా యే గానీ చాలా బాగా డీల్ చేశాడు అంత తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది సినిమా పాటలు కూడా అదే మాదిరి లో ఉంటాయి బాగుంది సినిమా చివరికి క్లైమాక్స్ చాలా సెంటిమెంట్ తో ముగింపు ఇచ్చాడు బాగుంది 👍👍👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!