16, జనవరి 2022, ఆదివారం

ఆహా ott లో విడుదల అయిన The american dream సినిమా పై నా అభిప్రాయం !!!

ఈ సినిమా ఆహా ott లో జనవరి 14 నుండి స్ట్రీమ్ అవుతుంది ప్రిన్స్, శుభలేఖ సుధాకర్, ప్రధాన పాత్రలో నటించటం జరిగింది ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!
ప్రిన్స్ ఒక below middle క్లాస్ అబ్బాయి తాను అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు తన ఫ్రెండ్ ద్వారా ఎలాగైతే వెళ్తాడు శుభలేఖ సుధాకర్ ప్రిన్స్ తండ్రి పాత్రలో చేసాడు 
అలా అమెరికా చేరుకున్న ప్రిన్స్ అక్కడ బాత్రూం లు కడగడం, హోటల్ లో పనిచేయటం లాంటివి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఎలాగైనా అక్కడ ఎం.స్ చేసి అక్కడే ఉద్యోగం పొందాలని అనుకుంటాడు 
అలా డబ్బులు సరిపోక అప్పులు చేస్తూ చివరకు తాగుబోతుల తయారు అవుతాడు
అయితే అక్కడే ఉండే రియా వర్మ అనే తెలుగు అమెరికా అమ్మాయి కి పరిచయం అవుతాడు వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అవుతారు శారీరకంగా కూడా కలుస్తారు అలాంటి పరిస్థితుల్లో ప్రిన్స్ రియా  వర్మ కార్ తో ఒక ఆక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని చంపేస్తాడు 
ఆ తరువాత చివరకు ఏమి అయ్యింది అన్నది సినిమా కథ సినిమా లో సగం ఇంగ్లీష్ మాటలే అమెరికా కాబట్టి అలా వాడరేమో
ఏది అయితేనేం సినిమా జస్ట్ average !!!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!