9, జనవరి 2022, ఆదివారం

డిస్నీ hotstar ott లో విడుదల అయిన "పరంపర " వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!

 


నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఆమని ప్రధాన పాత్రల్లో చేసిన పరంపర వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ఇక session 1 కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒకానొక టైం లో వీర నాయుడు అనే ఒక పెద్ద మనిషి వైజాగ్ సిటీ మొత్తం తన గుప్పిటలో ఉండేది అయితే తాను మాత్రం మంచి కోసం తప్ప చెడు కోసం ఎప్పుడు వాడలేదు అయితే తనకు ఒక కొడుకు నాయుడు చిన్నప్పుడు తనని చెరువులో పడినప్పుడు మోహన్ అనే అబ్బాయి కాపాడతాడు అప్పటి నుండి వీర నాయుడు ఆ అభిమానంతో మోహన్ ని దత్తత తీసుకుని పెద్ద కొడుకు లాగా పెంచుతాడు అది ఎందుకో నాయుడు కి నచ్చదు వీర నాయుడు ని శత్రువులు చంపేసిన తరువాత ఆ స్థానం ఎలాగైనా నాయుడు దక్కించుకోవాలని చూస్తాడు మోహన్ ఒక ఇంటిలో మనిషి గా చూస్తాడు తప్పించి అన్నగా ఎప్పుడు చూడడు వారసత్వ పరంపర కోసం జరిగే యుద్ధమే ఈ వెబ్ సిరీస్ 
తన నాన్న ని తక్కువ చేసి చూస్తున్నాడు అని నాయుడు అంటే మోహన్ రావు కొడుకు గోపి కి ఇష్టం ఉండదు 
ఇలా ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకుంటారు చివరకు ఎవరిది పై చెయ్యి అన్నది session 1 కథ ఇంతటితో అవ్వలేదు session 2 కూడా ఉంది 
పర్వాలేదు బాగుంది వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ చూసిన తరువాత ఆటోమేటిక్ గా మిగతా ఎపిసోడ్ లను చూడాలి అనిపిస్తుంది బాగుంది ఒక సారి try చేయవచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!