13, నవంబర్ 2025, గురువారం

Yenugu tondam ghatikachalam movie review !!!

 

ఏనుగు తొండం ఘటికాచలం Etv win OTT లో అందుబాటులో ఉంది రవి బాబు నటించి దర్శకత్వం వహించిన సినిమా సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!

ఏనుగు తొండం ఘటికాచలం (నరేష్) కుటుంబానికి పెద్ద తనకు ఇద్దరు కొడుకులు వాళ్లకు పెళ్లిళ్లు చేసి కోడళ్లు మనవళ్ల తో రెంట్ ఇంటిలో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తుంటారు అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఘటికాచలం పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తారు ఇద్దరు కొడుకులు అసలు ఏ పని చేయకుండా ఆ వచ్చిన డబ్బులతో ఇంటిని గడుపుతుంటారు

అయితే తనకు వచ్చే పెన్షన్ డబ్బుల గురించి ఆలోచించటం తప్పు తనను ఎవరు పట్టించుకోవటం లేదని ఒంటరి జీవితాన్ని భరించలేక పోతున్నానని ఒక రోజు ఘటికాచలం వాళ్ళ కుటుంబం తో తను అదే ఇంటిలో పనిచేసి పని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన్ని చెప్పి అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకుంటాడు 

అయితే తన నాన్నకు పెళ్లి అయితే వచ్చే పెన్షన్ డబ్బులు కూడా తమకు రావని ఇద్దరు కొడుకులు , వాళ్ళ భార్యలు ఆలోచించి ఘటిక చలానికి ఇన్స్యూరెన్స్ చేయించి తరువాత తనని చంపేసి ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులతో హాయిగా బ్రతకవచ్చు అనుకుంటారు 

అయితే వాళ్ళిద్దరూ కొడుకులు అన్నట్టుగానే జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ డబ్బు కోసం మనిషి ఎంత నీచానికి అయినా దిగజారుతాడు అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ దర్శకుడు రవి బాబు స్టైల్ లో కామెడీ టచ్ ఇచ్చి ఫినిష్ చేయటం జరిగింది 

రొటీన్ కథే చెప్పుకోవటానికి ఏమి లేదు కామెడీ కోసం ఒక సారి ట్రై చేయవచ్చు !!! 

12, నవంబర్ 2025, బుధవారం

Dies Arey movie review !!!


 Dies irae సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా ప్రముఖ నటుడు Mohanlal తనయుడు నటించిన సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో మొదటగా ఒక అమ్మాయి చనిపోతుంది నూతిలో దూకి అయితే అక్కడకు హీరో వస్తాడు ఆ అమ్మాయికి హీరో తెలుసు వాళ్ళ తమ్ముడు కూడా తెలుసు

అయితే వాళ్ళింటికి పలకరించడానికి వస్తాడు హీరో అక్కడి నుండి ఆ అమ్మాయి పెట్టుకున్న హెయిర్ క్లిప్ తన ఇంటికి తీసుకువస్తాడు అది ఇంటికి తెచ్చినప్పటి నుండి తన ఇంటిలో అసాధారణ సంఘటనలు జరుగుతుంటాయి హీరో మీద దాడి కూడా జరుగుతుంది 

బయటకు వెళదాం అనుకుని ప్రయత్నించిన అది కుదరదు అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మిగిలిన కథ 

కథ కొంచెం రొటీన్ గా ఉన్న కొంచెం హార్రర్ గా ట్రై చేశారు బాగానే ఉంది సినిమా చూడ వచ్చు !!!

అన్నట్టు ఈ సినిమా లో ఆరంభం లో కొంచెం అసభ్యకరమైన సీన్ ఉంది అది స్కిప్ చేస్తే సినిమా బాగానే ఉంది !!!


తెతలి బ్రహ్మ సూత్రం శివలింగం ఉన్న శివాలయం వీడియో !!!




 

9, నవంబర్ 2025, ఆదివారం

The Great Pre-Wedding Show movie review !!!

 


మసూదా సినిమా తో పేరు ఉన్న తీరువీర్ నటించిన The Great Pre-Wedding Show సినిమా థియేటర్ లలో విడుదల అయింది కామెడీ మూవీగా విడుదల అయిన ఈ సినిమా అసలు ఆలస్యం చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతుంటాడు అయితే photo studio ముందు  పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే అదే ఊరిలో ఉండే ఒక రాజకీయ నాయకుడి పెళ్లి కుదురుతుంది అయితే వాళ్ళ పెళ్ళికి మన హీరో pre wedding shoot కి ఫోటో స్టూడియో కి వస్తారు అయితే హీరో వాళ్ళకి రక రకాల ఫోటోలు తీస్తారు అయితే హీరో దగ్గర ఒక కుర్రోడు పనిచేస్తుంటాడు ఆ కుర్రాడికి ఆ pre wedding shoot లో తీసిన memory card ఇస్తాడు అయితే ఆ కుర్రోడు ఆ మెమొరి కార్డును తన లాగు జేబులో వేసుకుంటాడు ఆ లాగు కి జేబుకు చిల్లు ఉంటుంది  హీరో ఆ విషయం ఆ రాజకీయ నాయకుడికి తెలియకుండా ఎలా manage చేశాడు 

చివరికి రాజకీయ నాయకుడి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ  చూడటానికి ఒకసారి చూడవచ్చు కానీ తీరువీర్ నుండి ఆశించిన సినిమా అయితే కాదు అనిపించింది మొత్తానికి ఒకసారి చూడ వచ్చు 


ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మల్లి పూడి, జుత్తిగ గ్రామాల శివాలయాల వీడియోలు !!!

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లి పూడి గ్రామంలో ఉన్న శ్రీ ఉమ అగస్త్యేశ్వర స్వామి శివాలయం !!!/p>


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో ఉన్న శివాలయం వీడియో !!



Yenugu tondam ghatikachalam movie review !!!

  ఏనుగు తొండం ఘటికాచలం Etv win OTT లో అందుబాటులో ఉంది రవి బాబు నటించి దర్శకత్వం వహించిన సినిమా సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన సినిమా ఇంకా ఆలస...