23, ఫిబ్రవరి 2025, ఆదివారం

ధనరాజ్ "రామం రాఘవం" సినిమా పై నా అభిప్రాయం !!!

 కమెడియన్ ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


ఈ సినిమా లో సముద్రఖని హీరో ధనరాజ్ తండ్రి పాత్రలో నటించడం జరిగింది ఇంకా అసలు కథ విషయానికి వొస్తే 
ఒక గవర్నమెంట్ రిజిష్టర్ ఆఫీసులో పనిచేస్తుంటారు సముద్రఖని అయితే అసలు లంచం తీసుకోకుండా నిజాయతీ పరుడిగా ఉంటాడు అయితే తనకి ఒక కొడుకు పుడతాడు తన కొడుకుని ఎలాగైనా డాక్టర్ నీ చేయాలనుకుంటాడు కానీ బిడ్డలను అయితే కనగలం గానీ వారి తలరాతను మనం మార్చలేము అన్నట్టుగా తన కొడుకు చిన్నప్పటి నుండి బలాదూర్ గా తిరుగుతుంటాడు చదువును మధ్యలోనే ఆపేస్తాడు బెట్టింగ్, తాగటం ఇలా అన్ని అవలక్షణాలు ఉంటాయి 
ఫ్రెండుతో వ్యాపారం చేద్దామని నాన్న దగ్గర డబ్బు తీసుకుని బెట్టింగ్ లో పోగొట్టుకుంటాడు చివరకు వాళ్ళ నాన్న ఇలా ఇంటిలో చాలా జరుగుతాయి ఇవన్నీ భరించలేక ఇంటిలోనుండి బయటకు వెళ్ళిపోమంటాడు వాళ్ళ నాన్న అయితే బయటకు వెళ్లిన తరువాత వాళ్ళ నాన్న ను చంపాలని అనుకుంటాడు ఇలా ఎందుకు చేశాడు చివరకు వాళ్ళ నాన్న ని చంపడా లేదా అన్నది మిగిలిన కథ స్టోరి రొటీన్ గానే ఉంది కాకపోతే ఒకసారి కాలక్షేపం కోసం చూడవచ్చు !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...