" విజ్ఞానానికి - విలువలకు ,
ఆలోచనకు - అవగాహనకు ,
సంస్కృతులకు - సహకారానికి ,
భావోద్వేగానికి - భావవ్యక్తీకరణకు ,
మమకారానికి - మధురానుభూతులకు ... ఆలవాలం అమ్మ భాష "
ప్రపంచంలో ఎన్నో జాతులు .. మరెన్నో భాషలు . ఎన్ని భాషలున్నా మాతృభాష పంచే మాధుర్యం ముందు మరేది సాటి రాదు . జీవనోపాధికి ఎన్ని భాషలు నేర్చుకున్నా భావాన్ని ప్రస్పుటంగా తెలుపగలిగలిగేది అమ్మ భాషలోనే . ఎందుకంటే భావోద్వేగాన్ని స్పష్టంగా ఎదుటివారికి తెలిపేందుకు మాతృభాషను మించిన సాధనం మరొకటి లేదు . ఒక ప్రాంత సంస్కృతి , సాంప్రదాయాలకు అద్దం పట్టేది మాతృభాష . అందుకే , అమ్మభాషను రక్షించుకోవడానికి యునెస్కో ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది .
ఫిబ్రవరి 21 నే ఎందుకు ..!?
అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21 న నిర్వహించాలని యునెస్కో 30 బ సాధారణ మహాసభ 1999 లో ప్రకటించింది . ఈరోజు ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ . దేశ విభజన అనంతరం బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్ గా పిలిచేవారు . వారి మాతృభాష బెంగాలీ . కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు . అందుకే , తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు . ఆ ఉద్యమం 1952 నుండి నాలుగేళ్ల పాటు సాగింది . విద్యార్థులు , అధ్యాపకులు , ఉపాధ్యాయులు , ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు . చివరగా దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956 లో బెంగాలీ , ఉర్ధూ భాషలను అధికార భాషలు చేసింది . బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 21 న మాతృభాష దినోత్సవం గా జరిపేందుకు సిధ్దమైంది . ఈ ప్రతిపాదనను భారత్ సహా 29 దేశాలు మద్దతిచ్చాయి !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి