8, ఫిబ్రవరి 2024, గురువారం

అంబాజి పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పై నా అభిప్రాయం !!!


 కలర్ ఫోటో ఫేం సుహస్ నటించిన సినిమా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2 న థియేటర్లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటారు తన కులపు వృత్తి అయిన పని చేసుకుంటూ ఆ ఊరిలోనే ఉండే ఒక అగ్ర వర్ణం కులపు అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ విషయమే వాళ్ల ఇంటిలో తెలుస్తుంది అయితే హీరోకి ఒక అక్క ఉంటుంది అక్క తను కవల పిల్లలు అయితే తన అక్క బాగా చదివి టీచర్ అవుతుంది

ఆ వూరి స్కూల్ లోనే టీచర్ గానే పనిచేస్తుంది అయితే ఆ టీచర్ జాబ్ ఆ వూరి పెద్ద మనిషి వేయిస్తాడు అయితే ఊరంతా రక రకాలుగా అనుకుంటారు ఆ పెద్ద మనిషి ఒక సారి ఆ స్కూల్ లో సిమెంట్ బస్తాలు వేస్తాడు దానిని ఆ టీచర్ అడ్డుకుంటుంది దానితో మాట మాట పెరిగి చివరికి ఆ వూరి పెద్ద మనిషికి హీరో వాళ్ల అక్కకి పెద్ద గొడవ జరుగుతుంది అంతే కాకుండా ఆ పెద్ద మనిషి  చెల్లెలు,హీరో ప్రేమ విషయం తెలిసిపోతుంది 

ఆ కోపంతో ఆ హీరో వాళ్ల అక్కని వివస్త్ర చేస్తాడు అక్కడి నుండి కథ ఏ విధంగా మలుపు తిరిగింది చివరకు హీరో ఏమి చేశాడు అన్నది మిగిలిన కథ 

ఈ సినిమా 2007 లో జరిగినట్టు చూపించటం జరిగింది ఒక అగ్ర వర్ణానికి,ఒక తక్కువ వర్ణానికి మధ్య కొట్లాట గా ఈ సినిమా లో చూపించటం జరిగింది పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు  ambaji Peta marriage band movie review in Telugu 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!