వచ్చే ఎన్నికలలో జనసేన,తెలుగుదేశం పార్టీ ల మధ్య పొత్తు కుదిరి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి నిన్న అనగా28/02/2024 న జరిగిన తాడేపల్లిగూడెం లో భారీ బహిరంగ సభ జరిగింది దానికి సంబందించిన వీడియో మీ కొసం !!!
జనసేనాని మాట్లాడుతుండగా తీసిన చిన్న వీడియో క్లిప్ మీకోసం !!!29, ఫిబ్రవరి 2024, గురువారం
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
మమ్ముట్టి భ్రమ యుగం సినిమా పై నా అభిప్రాయం !!!
Brama yougam movie review in Telugu మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన భ్రమ యుగం సినిమా తెలుగులో ఫిబ్రవరి 23 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలో తప్పించుకుని తిరుగుతారు వారు పని చేసే రాజ్యంలో ఏదో యుద్ధం రావటం వలన అయితే అందులో ఒకడుని యక్ష్ణి చంపి తినేస్తుంది మరొక వ్యక్తి ఆ అడవిలో దూరంగా పారిపోతాడు అయితే అలా పారి పోతుండగా ఒక చోట పాడుబడ్డ ఒక ఇల్లు కనబడుతుంది అక్కడికి వెళతాడు అయితే అక్కడ ఒక వంట చేసే వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉంటాడు అయితే ఆ ఇల్లు కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ మనిషి ఈ వ్యక్తిని ఒక పాట పాడమంటాడు పాట పాడతాడు అప్పటి నుండి అక్కడే ఉండిపోమని అంటాడు ఆ ఇల్లు చుట్టూ వాతావరణం తనకి నచ్చదు
అక్కడి నుండి పారిపోవాలని ఎంత ప్రయత్నించినా అది కుదరదు అయితే ఆ ఇంటిలో ఉండే మనుషుల కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
ఈ సినిమా మొత్తం బ్లాక్ & వైట్ లోనే ఉంటుంది మొదట కొంచెం బోరింగ్ అనిపించిన మొత్తానికి అయితే బాగుంది సినిమా horror cinema అని చెప్ప వచ్చు మీకు tumbaad సినిమా చూసి ఉంటే same ఆ సినిమా ఏ గుర్తుకు వచ్చింది మొత్తానికి అయితే నిజంగా ప్రయోగాత్మక సినిమా అని చెప్ప వచ్చు మమ్ముట్టి నటన బాగుంది మిగతా యాక్టర్స్ అంటే కేవలం 4 మాత్రమే కనిపిస్తారు సినిమా అంతా
మలయాళం సినిమా అంటేనే అంతా అందులో ఒక మేజిక్ ఉంటుంది ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు బాగుంది సినిమా brama yugam movie review!!!
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
మోహన్ లాల్ monster సినిమా పై నా అభిప్రాయం !!!
మోహన్ లాల్ నటించిన monster సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ఇప్పుడు సోది లేకుండా సుత్తి లేకుండా ఇప్పుడు చూద్దాం !!!
ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఐటీ ఎంప్లాయ్ ఉద్యోగం పోయి ఏక్సిడెంట్ అవ్వటం వలన ఇంటిలోనే ఉంటాడు తనుకు ఒక కూతురు భార్య ఉంటారు భార్య టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంది అయితే ఇలా కథ ముందుకి సాగుతున్న తరుణంలో ఒక వ్యక్తి మోహన్ లాల్ తన ఫ్లాట్ అమ్ముకోవటనికి వస్తాడు అయితే అతను ఆ అమ్మాయి టాక్సీ నీ ఒకరోజు బుక్ చేసుకుంటాడు అయితే రిజిస్ట్రేషన్ కి కొద్ది టైం పడుతుంది అని ఆ టాక్సీ డ్రైవర్ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన నుండి అసలు కథ ముందుకు వెళ్తుంది
టాక్సీ డ్రైవర్ నీ బయటకు పంపి అక్కడ ఉన్న ఆ కాలు విరిగిన వ్యక్తి నీ మోహన్ లాల్ చంపేస్తాడు అసలు మోహన్ లాల్ ఎందుకు ఆ వ్యక్తిని చంపాడు అన్నది మిగిలిన కథ మొత్తానికి బాగుంది సినిమా అసలు కథ అప్పుడే మొదలవుతుంది
అసలు ఐటీ ఎంప్లాయ్ నీ ఎందుకు చంపినట్టు ఆ చంపిన case ను వాళ్ల భార్య పైకి వచ్చేలా చేస్తాడు అసలు తను చంపిన వ్యక్తిని తన భార్య పైకి వచ్చేలా ఎందుకు చేశాడు అన్నది మిగిలిన కథ లో ట్విస్ట్ అదే
బాగుంది సినిమా కథ సింప్లీ superb !!!
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
బూట్ కట్ బాలరాజు OTT లోకి రానుంది ?
Big boss సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి మొదటివారంలో విడుదల అయింది థియేటర్ లలో ఇప్పుడు ఈ సినిమా ఆహా OTT లో ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!
21, ఫిబ్రవరి 2024, బుధవారం
రేలంగి గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం (దేవాలయం వీడియో)
భీష్మ ఏకాదశి సందర్భంగా నిన్న అనగా 20/02/2024 మంగళవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం వీడియో లేదు ఆ లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయం వీడియో తీశాను దానికి సంబందించిన వీడియో మీకోసం
ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం జరుగుతుంది !!!
డిస్నీ hotstar లో విడుదల అయిన "నేరు " సినిమా పై నా అభిప్రాయం !!!
ఇది మోహన్ లాల్ నటించిన సినిమా నేరు సినిమా డిస్నీ+hotstar OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా గురించి అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో ఒక అంధ అమ్మాయిని ఒక ధనవంతుడు అబ్బాయి మాన భంగం చేస్తాడు దానిని నిరూపించటానికి ఆ అమ్మాయి పడిన వేదన ఎలా ఉంది అని సినిమా కథ మొదట ఈ case ను వాదించటానికి ఎవరు ముందుకు రారు అయితే అప్పుడు ప్రాక్టీస్ మానేసిన ఒక లాయర్ ఆ case ను వాదించటనికి మొదట సందేహ పడతాడు కానీ ఆ అంధ అమ్మాయిని చూసి చివరకు case ను ఒప్పుకుంటాడు
అయితే ఆ case వాదన ఎలా ముందుకు సాగింది అన్నది సినిమా కథ బాగుంది సినిమా చూడ వచ్చు డిస్నీ+హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది మోహన్ లాల్ యాక్టింగ్ పరంగా బాగుంది ఈ సినిమా neru movie review !!!
ఊరు పేరు భైరవ కోన సినిమా పై నా అభిప్రాయం !!!
Vuru Peru bairavakona movie review సందీప్ కిషన్ హీరో గా వచ్చిన vi ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊరుపేరు భైరవ కొన సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో హీరో ఒక స్టంట్ మాస్టర్ కింద పనిచేస్తుంటారు అయితే ఒక చోట హీరోయిన్ కనపడుతుంది అప్పటి నుండి హీరోయిన్ నీ ప్రేమిస్తుంటాడు అయితే హీరోయిన్ ఒక గిరిజన తెగ కు సంబందించిన అమ్మాయి ఆ వూరి హీరోయిన్ రావటానికి కారణం ఆ తెగ నివసిస్తున్న ప్రాంతం కబ్జాకు గురవుతుంది దానికి ఆ ప్రాంతం ఎలాగైనా తమదే అని నిరూపించటానికి అక్కడ పూర్వకాలంలో ఖననం చేసిన పుర్రెలు , ఎముకులు తీసుకువస్తుందిసినిమా ఆరంభంలో హీరో ఒక పెళ్ళిలో దొంగతనం చేస్తాడు ఆ నగలుతో పారిపోవాలని అనుకుంటాడు అయితే అనుకోకుండా భైరవ కోన అనే వూరిలో అడుగుపెదతాడు ఆ వూరిలో జనం కొంచెం విచిత్రంగా ఉంటారు ఇంతకు తెలిసింది ఏమిటంటే ఆ వూరిలో ఉండే వారు అందరూ అత్మలే ఆవురిలో ఉండే అత్మలలో తను ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది
అయితే హీరోయిన్ ఎలా చనిపోతుంది అసలు ఆ ఊరిలో ఆత్మలు ఎందుకు ఉన్నాయి అసలు హీరో దొంగతనం ఎందుకు చేశాడు ఆ భైరవ కొన కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
కథలో ఏదో miss అయినట్టు అనిపించింది Vuru Peru bairavakona movie review Telugu ఏదో సో సో గా ఉంటుంది కథ
పెద్దగా చెప్పుకోవటానికి ఏమి లేదు అంతా ఊహించినట్టుగానే ఉంటుంది కథ పెద్దగా ఆసక్తి కంబరిచెంత కథ అయితే ఏమి కాదు !!!
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
ఆహా లో విడుదల అయిన భామ కలాపం 2 సినిమా పై నా అభిప్రాయం !!!
ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా భామ కలాపం సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు 2 వచ్చింది మొదటి పార్ట్ లో ఒక వంటలు చేసే గృహిణిగా youtuber పెద్ద పేరు సంపాదించాలి అనుకుని పక్క వారి విషయాలలో వేలు పెట్టే అలవాటు ఉండటం వలన తన భర్త, కుటుంబం కష్టాల్లో నెట్టేది
ఇంకా రెండవ పార్ట్ లో కథ ఏమిటంటే యూట్యూబ్ వీడియో ల వల్ల ఫేమస్ అయిన తరువాత ఆ వచ్చిన డబ్బుతో ఒక హోటల్ పెట్టుకుంటుంది అయితే ఇక నుండి ఎటువంటి గొడవలకు వెళ్లానని భర్తకు ప్రమాణం చేస్తుంది అయితే వేరొక చోటికి వెళ్ళిన తరువాత అక్కడ ఒక హోటల్ నడుపుతుండంగా ఒక క్రిమినల్ నీ అనుకోకుండా పోలీస్ లకు పట్టిస్తుంది అయితే ఆ క్రిమినల్ బయటకు వచ్చి చంపేస్తానని బెదిరిస్తాడు
అయితే అతడిని తప్పించుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ నీ అశ్రయిస్తుంది అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ క్రిమినల్ నిచంపేసి ఆ case నీ ప్రియ మణి పై వేయాలని భావించి ప్రియమణికి బ్లాక్ మెయిల్ చేస్తాడు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ప్రియ మణి నీ అడ్డం పెట్టుకుని తను ఏమి సాధించాలని అనుకుంటున్నాడు చివరికి ఆ కోరిక నేర వెరిందా లేదా అన్నది మిగిలిన కథ
ఒక సారి చూడ వచ్చు మళ్ళీ దీనికి కొనసాగింపుగా భామ కలాపం 3 కూడా ఉంది !!!
12, ఫిబ్రవరి 2024, సోమవారం
Bakshak Movie Review !!!
Netflix OTT లో విడుదల అయిన భక్షక్ సినిమా హిందీ సినిమా ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరోయిన్ ఒక జర్నలిస్ట్ ఒక ఛానల్ కూడా ఉంటుంది కాకపోతే ఆ ఛానల్ నీ ఎవరు పెద్దగా చూడరు అయితే ఒక విషయం తెలుస్తుంది అది ఏమిటి అంటే ఒక బాలిక వసతి గృహంలో బాలికలు పై లైంగిక దాడులు జరుగుతాయి వాటిని బయటపెట్టి దాని వెనుక ఉన్న వ్యక్తిని బండారం బయట పెడదాం అనుకుంటుంది కానీ రాజకీయ అండతో ఆ వ్యక్తి బయట పడడు ఆ వ్యక్తి గా నటించింది cid సీరియల్ లో వచ్చే అభిజిత్ ఇందులో విలన్ లాగా నటించాడు
అయితే చివరికి ఆ బాలిక వసతి గృహంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు బయట ఎలా పెట్టింది దానికి హీరోయిన్ పడ్డ కష్టం ఏమిటి అన్నది మిగిలిన కథ మొదట కొంచెం ఆసక్తిగా మొదలైన కథ వెళ్ళే కొద్ది బోరింగ్ గా అనిపించింది రొటీన్ గానే ఉంది పెద్దగా ఏమి లేదు సినిమా లో !!!
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
పేరుపాలెం బీచ్ లో సరదాగా కాసేపు ?
పేరుపాలెం బీచ్ మొగల్తూరు దగ్గరగా ఉన్న బీచ్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉండే బీచ్ కావడంతో ఫ్యామిలీ తో సరదా గా కాసేపు అల వెళ్ళాం దాదాపు మా ప్రయాణం 3 గంటలు పైనే పట్టింది
బీచ్ అంటే ఒక సరదా ఎన్ని బాధలు ఉన్న ఎన్ని కష్టాలు కాసేపు వాటన్నింటినీ మర్చి పోయే ఒక ఉపశమనం అంతే మేము మంగళవారం ఫిబ్రవరి 6 తారికున 2024 లో వెళ్ళాము
కాసేపు అలా సెడతీరి కేవలం ఆదివారం మాత్రమే జనం ఉంటారు అనుకున్నాను కానీ మంగళవారం కూడా ఉన్నారు జనం అక్కడ తీసిన కొన్ని ఫోటోలు
ఇప్పటికే మూడు సార్లు వెళ్లిన కూడా మొదటి సారి వెళ్ళన్నప్పటి లాగే కొంచెం భయంవేసింది తరువాత అలవాటు అయింది కొంచెం కొంచెం భయం తగ్గింది మొత్తానికి ఫ్యామిలీ కి, మనకి కొంచెం ఆట విడుపు గా ఉంది !!!
8, ఫిబ్రవరి 2024, గురువారం
అంబాజి పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పై నా అభిప్రాయం !!!
కలర్ ఫోటో ఫేం సుహస్ నటించిన సినిమా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫిబ్రవరి 2 న థియేటర్లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటారు తన కులపు వృత్తి అయిన పని చేసుకుంటూ ఆ ఊరిలోనే ఉండే ఒక అగ్ర వర్ణం కులపు అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ విషయమే వాళ్ల ఇంటిలో తెలుస్తుంది అయితే హీరోకి ఒక అక్క ఉంటుంది అక్క తను కవల పిల్లలు అయితే తన అక్క బాగా చదివి టీచర్ అవుతుంది
ఆ వూరి స్కూల్ లోనే టీచర్ గానే పనిచేస్తుంది అయితే ఆ టీచర్ జాబ్ ఆ వూరి పెద్ద మనిషి వేయిస్తాడు అయితే ఊరంతా రక రకాలుగా అనుకుంటారు ఆ పెద్ద మనిషి ఒక సారి ఆ స్కూల్ లో సిమెంట్ బస్తాలు వేస్తాడు దానిని ఆ టీచర్ అడ్డుకుంటుంది దానితో మాట మాట పెరిగి చివరికి ఆ వూరి పెద్ద మనిషికి హీరో వాళ్ల అక్కకి పెద్ద గొడవ జరుగుతుంది అంతే కాకుండా ఆ పెద్ద మనిషి చెల్లెలు,హీరో ప్రేమ విషయం తెలిసిపోతుంది
ఆ కోపంతో ఆ హీరో వాళ్ల అక్కని వివస్త్ర చేస్తాడు అక్కడి నుండి కథ ఏ విధంగా మలుపు తిరిగింది చివరకు హీరో ఏమి చేశాడు అన్నది మిగిలిన కథ
ఈ సినిమా 2007 లో జరిగినట్టు చూపించటం జరిగింది ఒక అగ్ర వర్ణానికి,ఒక తక్కువ వర్ణానికి మధ్య కొట్లాట గా ఈ సినిమా లో చూపించటం జరిగింది పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు ambaji Peta marriage band movie review in Telugu
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
Gunturu karam OTT Release date ?
Super star మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్ లుగా వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో థియేటర్ లలో విడుదల అయింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇప్పుడు ott లోకి రానుంది ఈ సినిమా Netflix OTT లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
Paramporul Movie Review In Telugu !!!
Paramporul Movie Review ETV win OTT లో విడుదల అయిన paramporul మూవీ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో Etv win OTT లో అందుబాటులో ఉంది

Ponman సినిమా పై నా అభిప్రాయం !!!
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...