13, ఫిబ్రవరి 2021, శనివారం

డిస్నీ హాట్ స్టార్ లోని "Live Telecast" వెబ్ సీరీస్ పై నా అభిప్రాయం !!!

 ఇవాళ మా ఊరిలో ఓట్లు ఎలక్షన్ పండగ పొద్దున్నే లేచి స్నానం చేసి నీట్ గా రెడి అయ్యి ఓటు స్లిప్ అట్టుకుని ఓటు వేయటానికి వెళ్ళాను నా ముందర ఖాళీ గానే ఉంది 

వెంటనే 10 నిమిషాలలో ఓటు వేసి బయటకు వచ్చేసాను ఈ రోజు ఖాళీగా ఉండి ఏం చేద్దామా అని ఆలోచిస్తే వెంటనే టి. వి చూస్తే అందులో మంచి హార్రర్ గా కనిపించింది

కాజోల్ అగర్వాల్ నటించిన " Live telecast " ట్రైలర్ కనిపించింది ఈ రోజు చూద్దామని ఒక లుక్ ఏసా చూసాను చెపుతాను

ఈ కథ మాములు రొటీన్ గానే ఉంది అన్ని ఎపిసోడ్స్ మొత్తం ఒకేసారి చూసాను మొత్తం కలిపి 3 గంటల 43 నిమిషాల నిడివి ఉంది 

మనకు మామూలుగానే హార్రర్ మూవీస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ట్ 

ఇక కథ విషయానికి వస్తే ఒక ఛానల్ లో పనిచేసే ఒక ఒక టీం నిజంగా జరిగిన విషయాలకు కొద్దిగా ఇంకా భయం వేసేలా ఎపిసోడ్స్ తయారు చేసి టెలికాస్ట్ చేస్తుంటారు ఇదంతా ఆ ఛానల్ TRP కోసం అలాగే ఒకసారి హార్రర్ తో కూడిన కొంచెం బోల్డ్ గా ఒక ఎపిసోడ్ షూట్ చేస్తారు అయితే ఆ ఎపిసోడ్ వల్ల మొత్తం ఆ ఛానల్ trp పడిపోతుంది దానితో ఆ ప్రోగ్రాం అక్కడితో ముగించాలని సిద్దపడుతుంది ఛానల్

ఇక దానితో వారికి పనిలేక ఖాళీగా ఉంటారు అప్పుడు అందరికి ఒక ఐడియా వస్తుంది అదే haunted house లో live టెలికాస్ట్ చేస్తే మళ్ళీ ఆ ఛానల్ కి TRP పెరుగుతుందని భావించి ఒక haunted house లో షూటింగ్ ప్రారంభిస్తారు

ఆ తరువాత ఆ షూటింగ్ లో వారికి ఎదురైన అనుభవాలు, పరిస్థితులు , ఈ సిరీస్ లో చూడాలి 

మొత్తం ఈ సిరీస్ 7 భాగాలుగా ఉంటుంది డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆయన తీసిన సినిమాలు సూర్య రాక్షసుడు సినిమా ఎలా హారర్ ఫీల్ అవ్వుతామో ఆ విధంగా ఈ సినిమాలో కూడా కొంచెం హార్రర్ ఎక్స్పర్ట్ చేయొచ్చు

ఎక్కువ ఇంగ్లీష్ హార్రర్ మూవీస్ చూసే వారికి అంతగా భయం అనిపించదు కానీ ఈ సిరీస్ మాత్రం మంచి టైం పాస్ గా చూడవచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!