9, ఫిబ్రవరి 2021, మంగళవారం

" జి -జాంబీ " సినిమా పై నా అభిప్రాయం !!!

 జాంబీ సినిమాలు హాలీవుడ్ లో ఎక్కువుగా వస్తాయి కానీ ఇప్పుడు మన తెలుగులో కూడా ఈ హవా మొదలైంది 

అప్పుడెప్పుడో 4 సంవత్సరాలు క్రితం తమిళ్ సినిమా జయం రవి నటించిన యమపాశం సినిమా లో జాంబీలు చూసాం 

మరలా ఇప్పుడు తెలుగులో ఈ నెలలో అప్పుడే రెండు జాంబీ తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి అందులో ఒకటి "జి -జాంబీ" సినిమా

ఇక ఈ కథ విషయానికి వస్తే ఒక డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్ గా పనిచేసే ఒక అమ్మాయి చాలా ప్రయోగాలు చేసి విజయవతమయ్యాయి అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ మనిషిలో ఇమ్మ్యూనిటి పవర్ పెంచటానికి ఒక మెడిసిన్ కనిపెడుతుంది

ఆ మెడిసిన్ మనుషులు మీద నేరుగా ప్రయత్నించటానికి permission అడుగుతుంది పెద్ద డాక్టర్ ని మొదట ఆ డాక్టర్ వద్దంటాడు కానీ ఆ తరువాత ఒప్పుకుంటాడు 

అయితే దానికి హీరో ని కూడా తమ వెంట తీసుకువెళ్లాలని కండిషన్ పెడతాడు ఆ ప్రయోగం ఒక క్రిమినల్ మీద ప్రయోగిస్తారు కానీ ఆ ప్రయోగం వికటించి ఆ క్రిమినల్ జాంబీ గా మారుతాడు

ఆ తరువాత ఏమైంది అనేది కథ ఇది వినటానికి బాగానే ఉంది చూడటానికి అంతగా ఏమి బాగోలేదు కానీ వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు

కానీ సినిమా మాత్రం అంతగా ఆసక్తి లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!