14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనలోని అభిరుచి +ఆసక్తి = ఆదాయం (యూట్యూబ్, బ్లాగ్ ) !!!

 అవును మీరు విన్నది sorry చదివింది నిజం మనిషికి ఎన్నో ఇష్టాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో సరదాలు, మరెన్నో అభిరుచులు ఇదే జీవితం

ప్రతి మనిషికి తన జీవితంలో ఏదొక అభిరుచి, ఆసక్తి ఉంటుంది అదే మన జీవితానికి సరదాలని, సంతోషాల్ని తెస్తుంది 

ఇక సోది అంతా ఆపేసి అసలు విషయానికి వస్తే ముందుగా మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం 

యూట్యూబ్ నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అంటే తెలియని వారు ఉండరు నేడు మనిషికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునేది మొదటగా గూగుల్, ఆ తరువాత యూట్యూబ్ లో చూస్తున్నారు నాకు తెలిసి సుమారుగా 4, 5 సంవత్సరాలు క్రితం 4g టెక్నాలజీ రావటంతో అందరికి ఇంటర్నెట్ బాగా దగ్గరైంది ప్రతి ఒక్కరికి ఆన్లైన్, ఇంటర్నెట్ అంటే ఒక అవగాహన ఏర్పడింది

మనకు ఏ విషయం మీదనైన ఆసక్తి, అభిరుచి ఉంటే దానికి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ సంపాదించవచ్చు దానికి కావాల్సింది

మనకు తెలిసిన విషయం మీద అవగాహన కలిగి ఉండటం అలాగని మరొకరి వీడియోలు కాపీ చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేస్తే దానికి ఎటువంటి మనీ రాదు మన సొంతంగా తయారు చేసిన లేదా తీసిన వీడియోలు మాత్రమే అప్లోడ్ చెయ్యాలి

ఇక దీనికి 4000 గంటలు వాచ్ టైం ఉండాలి, 1000 మంది subscribers ఉండాలి ఈ రెండింటిని మీరు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి అప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ approve అయ్యి మీ వీడియో ల మీద యాడ్స్ వస్తాయి తద్వారానే మీకు మనీ వస్తుంది

ఇక రెండోవది బ్లాగ్ ఇది కూడా అటువంటిదే మీకు ఏ విషయం గురించి నైనా అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా రాయ గలిగితే మీకు మీ బ్లాగ్ ద్వారా మనీ సంపాదించవచ్చు

ఇది కూడా మీ సొంత కంటెంట్ మాత్రమే ఉండాలి ఇక్కడ కూడా మీకు మీ బ్లాగ్ ok అయితే మీ బ్లాగ్ లో యాడ్స్ వేస్తారు గూగుల్ అవి ఎక్కుమంది చూస్తే మీకు తద్వారా మనీ వస్తుంది 

కాబట్టి మన అభిరుచి, ఆసక్తి అదే మన ఆదాయ వనరుగా మారుతుంది 

చివరగా ఒక్క మాట యూట్యూబ్, బ్లాగ్ అనేది వీటిలో success కావటానికి చాలా టైం పడుతుంది అలాగే కష్ట పడాలి కూడాను !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!