30, నవంబర్ 2024, శనివారం

వికటకవి webseries పై నా అభిప్రాయం !!!

 

Zee5 OTT లో అందుబాటులో ఉన్న వికటకవి వెబ్ సిరీస్ మన తెలుగు వెబ్ సిరీస్ నరేష్ ఆగస్త్య నటించిన webseries అసలు ఆలస్యం అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1960 70 కాలంలో జరిగిన కథ అనగనగా అమరగిరి అనే ఒక ప్రాంతం ఆ ఊరిలో ఒక అడవి ఆ అడవిలోకి వెళ్లిన వారందరూ వాళ్ళ జ్ఞాపకశక్తి కోల్పోతారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా మన హీరో హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు అయితే మన హీరోకి డిటెక్టివ్ అవ్వాలని ఆశ అయితే ఇలాంటి డిటెక్టివ్ ఆ అమరగిరిలో ఉండే ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం అని ఎలా వెళ్ళాడు 

అక్కడికి వెళ్ళిన తరువాత ఆ మిస్టరీ నీ చేధించడా లేదా అన్నది మిగిలిన కథ నాకెందుకో ఎన్నో మిస్టరీ లుని చూసిన ఆ కథ లాగ్ ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ఈ webseries అంటే webseries దాదాపు అన్ని అలాగే ఉంటాయి

సస్పెన్స్ కోరుకునే వారికి అక్కడక్కడ కనిపించింది కాకపోతే పెద్ద ఇంపాక్ట్ గా ఏమి లేదు కథ ను ముందే ఊహించ వచ్చు  సో మీకు ఖాళీ ఉంటే చూడండి లేకపోతే లేదు !!!

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ మూవీ పై నా అభిప్రాయం !!!


 ఆహా OTT లో విడుదల అయిన ఈ సినిమా ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమా ప్రియ దర్శి సినిమా అంటే minimum కామెడీ ఎక్సపెక్ట్ చేసి చూసాను సినిమా ఇంక లేట్ చేయకుండా అసలు కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఒక దొంగ బ్యాంకులో దొంగతనం చేస్తాడు అక్కడి నుండి పారిపోవటానికి ఒక కార్ ఎక్కుతాడు అయితే ఆ కార్లో ఉండే డ్రైవర్ నీ బెదిరించి తనకు కావాల్సిన చోట దింపమంటాడు అయితే బ్యాంకులో ఎవరో ఒక వ్యక్తి తుపాకీ కాల్చడం వలన ఆ దొంగ కొద్దిగా గాయపడతాడు

కొంచెం దూరం వెళ్ళిన తరువాత దొంగ స్పృహ తప్పుతాడు అతడు దగ్గర ఉన్న డబ్బును ఎలాగైనా దొంగిలించాలని అనుకుంటాడు డ్రైవర్ దొంగ దగ్గర ఉన్న తుపాకీ లాక్కుంటాడు ఇంతలో దొంగకు మెలుకువ వస్తుంది ఇద్దరు కొంచెం సేపు దెబ్బలాడుకుంటారు ఇంతలో డ్రైవర్ చేతిలో ఉన్న గన్ పేలి దొంగకు తగుల్తుంది 

డ్రైవర్ భయపడి hospital కి తీసుకుని వెళ్దాం అనుకుంటాడు కానీ దొంగ ఏదైనా హోటల్ రూం తీసుకెళ్ళమంటాడు డ్రైవర్ ఒక హోటల్ రూం కి తీసుకెళ్తాడు

అక్కడ ఒక రూం తీసుకుంటారు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వీళ్ళ యవ్వారం చూసి ఆ డబ్బు ఉన్న bag నీ కాజేస్తుంది ఇంతకీ మనహీరో priyadarsi ఎక్కడ అనుకుంటున్నారా ఆగండి చెబుతాను మన హీరో ది వేరే కథ తను ప్రేమించిన అమ్మాయి డబ్బు సమస్య వాళ్ళ నాన్న డబ్బు కోసం వేరే అబ్బాయితో పెళ్లి కాయం చేస్తాడు హీరోయిన్ హీరో నీ పెళ్ళి చేసుకోవాలంటే 50 లక్షలు కావాలి అని చెబుతుంది హీరో ఆ డబ్బు కోసం ప్రయత్నం చేస్తాడు 

ఇప్పుడు మళ్ళీ మొదటి కథలోకి వెళితే ఆ రిసెప్షనిస్ట్ తిరిగి ఆ డ్రైవర్ కి, దొంగకి దొరుకుతుంది వీళ్ల ముగ్గురు దొంగలే చెప్పాలంటే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారు అయితే కథ చివరికి ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ మీలో చాలా మందికి తెలిసి పోయే ఉంటుంది అది కథ ఇందులో చెప్పుకోవటానికి ఏమి లేదు చాలా బోరింగ్ గా నడుస్తుంది కథ !!!

27, నవంబర్ 2024, బుధవారం

మెకానిక్ రాకీ సినిమా పై నా అభిప్రాయం !!!


 Viswaksen నటించిన మెకానిక్ రాఖీ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక కార్ మెకానిక్ అయితే వాళ్ళ నాన్నకు చిన్నప్పటి నుండి ఒక కోరిక కాశ్మీర్ తో కన్యాకుమారి తిరగాలని కానీ అది కుదరదు అయితే హీరో ఒక ప్లాన్ వేసి కాశ్మీర్ తో కన్యాకుమారి పంపిస్తాడు అయితే అసలు హీరో వాళ్ళ నాన్న నీ ఎందుకు పంపించాడు అన్నది అసలు కథ 

ఒక మరణం జరిగితే ఆ మరణాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మోసగాళ్ళు ఎలా మనుషుల్ని మోసం చేస్తున్నారు వాటిని హీరో ఎలా తిప్పి కొట్టాడో అన్నది మిగిలిన కథ 

మొదట్లో రొటీన్ గానే మొదలైన కథ లో కొద్దిగా ట్విస్ట్ లతో సాగుతూ చివరకు హీరో డామినేషన్ తో కథ ముగుస్తుంది మొత్తానికి బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు !!!

Zebra movie Review !!!


 Satya dev zebra movie review సత్య దేవ్ నటించిన zebra movie థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో తెలుసుకుందాం!!!

ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పనిచేస్తుంటారు అయితే తను ప్రేమిస్తున్న అమ్మాయి కూడా వేరొక బ్యాంక్ లో పనిచేస్తుంది అయితే ఒక మిస్టేక్ వల్ల ఒకరి అకౌంట్ లో పడవలసిన అమౌంట్ మరొక అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అప్పుడు కస్టమర్ ఆ అమ్మాయి హీరోయిన్ తో గొడవ పడతాడు అయితే అప్పుడు హీరో బ్యాంక్ లో ఉన్న లూప్ హోల్స్ తో ఆ అమౌంట్ క్లియర్ చేస్తాడు

ఒకరి అకౌంట్లో వెయ్యబోయి మరొక అకౌంట్ లో అమౌంట్ పడింది కదా ఆ అకౌంట్ ఓనర్ నీ అడిగితే అమౌంట్ తిరిగి ఇవ్వడు అయితే వాడికి ఆశ చూపించి ఆ అకౌంట్లో money నీ తెలివిగా తీసుకుంటాడు హీరో అయితే ఆ వ్యక్తి హీరో నీ ఎలాగైనా దెబ్బ కొట్టాలని అతడు పని చేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్న అమౌంట్ నీ హీరో అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ వ్యక్తి వెనుక ఉన్నది ఒక పెద్ద రౌడీ అయితే ఆతరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ 

ఇందులో సునీల్ కూడా ఉంటాడు విలన్లుగా, మరీ అంత బోరింగ్ గా ఏమి ఉండదు సినిమా చూడ వచ్చు బాగుంది కాకపోతే నాకెందుకో హీరో కటే విలన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచిన్నట్టు అనిపించింది

ఏదైతేనేం మొత్తానికి సత్యదేవ్ సినిమా చూడ వచ్చు ఒకసారి అంతా బ్యాంకులో జరిగే లూప్ హోల్స్ గురించి చూపెట్టడం జరిగింది సినిమా మొత్తం  !!! Zebra movie review,

24, నవంబర్ 2024, ఆదివారం

Repati velugu movie Review !!!

 ETV win OTT లో విడుదల అయిన రేపటి వెలుగు సినిమా మలయాళం dubbing తెలుగులో అందుబాటులో ఉంది 

ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం అది ఒక  అటవీ ప్రాంతం లో ఒక ఇంటిలో నివసించే ఎలక్ట్రిక్ పనులు చేస్తుంటాడు ఒక వ్యక్తి ఆ ఇంటిలో ఒక పెద్దావిడ ఇద్దరు కొడుకులు ఉంటారు అందులో పెద్ద కొడుకు ఎలక్ట్రిక్ పనులు చేస్తాడు అయితే అతను కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి ఆ అమ్మాయిని తీసుకువస్తాడు

ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ అమ్మాయికి రక రకాలుగా టార్చర్ పెడతాడు  ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది కథ 

కథ చాలా స్లో గా ఉంటుంది అతను పెట్టే టార్చర్ భరించలేక ఒకసారి వాడిని చంపెద్దాం అనుకుంటుంది ట్రై చేస్తుంది కానీ పని అవ్వదు అయితే చివరికి కథ ఎలా ముందుకు సాగింది అన్నది కథ !!!

కథ చాలా స్లో గా ఉంది షార్ట్ ఫిల్మ్ కి తక్కువ సీరియల్ కి ఎక్కువ గా ఉంది !!!

రకరకాల లైట్ లు తయారు చేస్తాడు ఇంటిలో ఒక లైట్ పెడతాడు అది నైట్ టైం కూడా ఆఫ్ చేయడు ఆది ఆఫ్ చెయ్యమని తన భార్య అడిగిన ఆపడు పైగా ఆప మన్నందకు చితక కొడతాడు

అయితే చివరకు తన భర్తను చంపేసిందా లేదా అన్నది మిగిలిన కథ !!!

ka movie ott

 ka movie ott కిరణ్ అబ్బవరం నటించిన సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 న విడుదల థియేటర్ లలో విడుదల అయిన సినిమా ఇప్పుడు నవంబర్ 28 నుండి Etv win OTT లోకి అందుబాటులోకి రానుంది 

ka movie ott

20, నవంబర్ 2024, బుధవారం

kishkindha kandam review telugu

 kishkindha kandam review telugu

మలయాళం dubbing సినిమా తెలుగులో డిస్నీ హాట్స్టార్ లో అందుబాటులో ఉంది అసలు లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

kishkindha kandam review telugu ఇందులో హీరో ఒక అటవీ శాఖలో ఆఫీసర్ అతను ఉండే ఊరిలో కోతులు ఎక్కువుగా ఉంటాయి తన మొదట భార్య చనిపోతుంది తన 5 ఏళ్ల కొడుకు కనపడకుండా పోతాడు తన తండ్రి ఆర్మీ లో పని చేసి రిటైర్ అవుతాడు అయితే తన తండ్రికి మతి మరుపు అప్పుడు హీరో రెండో పెళ్లి చేసుకుంటాడు అయితే ఆ ఊరిలో ఎలెక్షన్ నేపథ్యంలో గన్స్ అందరూ సరెండర్ పోలీస్ స్టేషన్ లో చేయాల్సి వస్తుంది కానీ తన తండ్రి గన్ మిస్ చేసుకుంటాడు

ఇలా కథ మొదట్లో కొద్దిగా స్లో గా సాగుతుంది ఆ తరువాత హీరో వాళ్ళు ఉంటున్న పక్క స్థలంలో ఒక కోతి అస్థిపంజరం దొరుకుతుంది అక్కడి నుండి కథ ఉపు అందుకుంటుంది kishkindha kandam review telugu

చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ ఇందులో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండదు అలా నడిచిపోతుంది కథ 2nd half నుండి స్పీడ్ గా వెళ్తుంది అసలు ఆ గన్ ఏమైంది, తన కొడుకు ఎలా తప్పిపోయాడు, తన భార్య ఎలా చనిపోయింది,తన తండ్రికి నిజంగానే మతి మరుపు ఉందా ? kishkindha kandam review telugu

9, నవంబర్ 2024, శనివారం

Jibaro movie Review in Telugu !!!


 Jibaro movie Review 

Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక అడవి ప్రాంతంలో కొంతమంది సైనికులు వెళుతుంటారు అక్కడ ఒక సరస్సు లాగా ఉంటుంది అందులో ఒక సైనికుడు ఆ సరస్సులో తొంగి చూస్తాడు అక్కడ ఒక బంగారం ముక్క కనపడుతుంది అయితే అనూహ్యంగా కొద్దిదూరం లో ఒక అమ్మాయి అదే మంత్రగత్తె ఒంటి నిండా బంగారం తో  నాట్యం చేస్తుంటుంది ఆ నాట్యం తో పాటు కర్ణ కటోరం గా కేక పెడుతుంది ఆ కెక్టో ఆ సైనికులు అందరూ మాయలో పడి ఒకరినొకరు చంపుకుంటూ ,పొడుచుకుంటూ ఆ మంత్ర గత్తే దగ్గరకు వెళ్తారు అయితే అక్కడికి వెళ్ళిన వారందరూ చివరకు చనిపోతారు 

ఒక సైనికుడు మాత్రం ఇవేమీ వినపడదు అయితే ఆ మంత్ర గట్టే ఆశ్చర్యంగా చూస్తోంది ఆ సైనికుడు ఈ మంత్ర గట్టె ను చూసి భయపడి పరిపోతుంటాడు ఒక చెట్టు తగిలి పడిపోతాడు 

రాత్రి చీకటి పడటంతో ఒక చోట పడుకుని ఉంటాడు అక్కడికి ఆ మంత్ర గతే వస్తుంది ఆ సైనికుడు పై మనసు పడుతుంది ఉదయం లేచి చూసే సరికి ఆ మంత్ర గట్టి తన పక్కన పడుకుని ఉండటం చూసి వెంటనే పట్టుకుంటాడు కానీ దొరకదు పారి పోతుంది తనను ఎలాగైనా పట్టు కోవాల్ని చూస్తాడు 

ఒక చోట ఒక నదిలో తనే సైనికుడి దగ్గరికి వస్తుంది తన నీ దక్కించుకోవాలని చూస్తుంది అయితే ఆ సైనికుడు ఆ మంత్ర గత్తే ను చంపేసి బంగారం అంతా ఒలిచేసి నదిలో పడేస్తాడు 

ఆ బంగారాన్ని తీసుకుని ఆ సైనికుడు ప్రయాణం చేస్తాడు ఒక చోట దాహం గా ఉండి మంచినీటి కోసం ఒక నదిలో నీళ్ళు తాగుతాడు అయితే ఆ నది నిండా మంత్ర గత్తే రక్తంతో నిండి ఉంటుంది ఆ నీళ్ళు తగిన వెంటనే ఆ సైనికుడికి వినపడుతుంది 

మంత్ర గత్తే కూడా బ్రతికే ఉంటుంది తన బంగారం పోయింది అనుకుంటుండుంగా ఆ సైనికుడు కనిపిస్తాడు వెంటనే పెద్ద గా కేక వేస్తుంది దానితో ఆ సైనికుడు కూడా వెంటనే ఆ నది లోకి దూకి చనిపోతాడు 

ఈ సినిమా చూస్తున్నంత సేపు విక్రమ్ తంగాలన్ సినిమా గుర్తుకువచ్చింది కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంది 

Jibaro అంటే ఆ సైనికుడి పేరు 

Devara movie Review !!!

 Devara movie OTT young tiger NTR నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 న థియేటర్ లో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా Netflix OTT లోకి నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ అవుతుంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో సముద్ర తీరం ఎర్ర సముద్రం అనే ఊరూ ఉంది ఆ ఊరిలో నలు దిక్కులు నలుగురు వ్యక్తులు పరిపాలిస్తుంటారు అందులో ఒక నాయకుడు దేవర అయితే వాళ్ళు చేసే పని నౌక లో సరుకును అక్రమంగా వేరే వాళ్లకు అందిస్తారు ఆ పనితో వాళ్లకు డబ్బులు వస్తాయి కానీ ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ కి దేవరతో పాటు నలుగురు నాయకులు దొరికిపోతారు devara movie Review అక్కడినుండి ఆ నేవీ ఆఫీసర్ మీరు చేసే ఈ పని వల్ల చాలామంది అమాయకులు చనీపోతున్నారు దీనివలన మీకే ప్రమాదం అని చెబుతాడు అప్పటి నుండి దేవర మారతాడు

కానీ ఆ మిగిలిన ముగ్గురు లో ఒక నాయకుడు దేవర వైపే ఉంటాడు కానీ మిగిలిన ఇద్దరు ఈ పని కొనసాగిస్తుంటారు వాళ్లు సంద్రంలో దొంగతనానికి వెళ్లిన ప్రతి సారి దేవర వాళ్లకు అడ్డు పడతాడు

ఇలా కథ జరుగుతుండగా దేవర ఎవరికి కనిపించకుండా కేవలం సముద్రం లో ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళను చంపటానికి సముద్రంలో కవాలి కాస్తుంటాడు దేవర బిడ్డ వర ఆ ఊరిలో పిరికివాడిగా ఉంటాడు

ఆ తరువాత కథ ముందుకు ఎలా వెళ్ళింది అన్నది మిగిలిన కథ అంతగా ఏమి లేదు సినిమా కానీ బోరింగ్ గా అయితే లేదు ఒకసారి చూడ వచ్చు కానీ 2 పార్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ దాదాపు 3 గంటలు ఉంది సినిమా 

DEVARA MOVIE Review, DEVARA OTT Release,Devara Movie Review In Telugu,

7, నవంబర్ 2024, గురువారం

Life stories movie review !!!

 Etv win OTT లో విడుదల అయిన Life stories movie review in Telugu 

ఈ కథ 5 కథలును చూపిస్తుంది ఇలాంటివి మనం ముందర కూడా చాలా చూశాం అలాంటివే కాకపోతే కొత్తగా ఏమి లేదు ఒక వ్యక్తి కార్ బుక్ చేసుకుని కార్ లో బయలుదేరతాడు 

అతడికి డ్రైవర్ కి మంచి ఫ్రెండ్ షిప్ అవుతుంది 

ఇంక 2 వ కథ ఒక వూరిలొ ఒక ముసలావిడ ఒక టీ కొట్టు నడుపుతుంటుంది గిరాకీ లేక డల్ గా నడుస్తుంది అప్పుడే ఒక కార్ లో ఒక వ్యక్తి ఒక కుక్కని దింపేసి వెళ్లి పోతాడు ఆ కుక్కని ఆ ముసలావిడ పెంచుకుంటుంది తద్వారా తన ఆదాయం కూడా బాగా మెరుగు అవుతుంది 

అలా మొత్తం 5 కథలు ఉంటాయి కానీ ఈ సినిమా అంతా ఏమి లేదు జస్ట్ below average movie ఆ 5 కథల్ని చివరికి అందరి పాత్రలు ఒకరికొకరు కలుపుతూ లాస్ట్ కి ఎండ్ చేస్తారు

ఆ ముసలావిడ charcter తప్పించి సినిమాలో అంతగా ఏమి లేదు అసలు !!!

Lucky bhaskar movie review !!!

 Lucky baskar movie review in telugu


Venky అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా  అక్టోబర్ 31 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కష మిశు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!

ఈ సినిమా కథ ముంబై లో జరుగుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న, చెల్లి,తమ్ముడు, భార్య, కొడుకు ఇదే ఫ్యామిలీ హీరో ఉద్యోగం ఒక ప్రైవేటు బ్యాంక్ లో క్యాషియర్ జాబ్ చాలి చాలని జీతం ప్రమోషన్ కోసం వైట్ చేస్తుంటాడు ఏమైనా జీవితం మరబోతుందా అని కానీ ప్రమోషన్ రాదు ఇంటి చుట్టు అప్పులు ఎక్కువ అవుతాయి

తను రోజు ఆఫీసు కి వచ్చే స్కూటర్ కూడా అప్పులు వాళ్ళు లాగేసుకుంటారు తనకు రావాల్సిన ప్రమోషన్ వేరే వ్యక్తి కి వస్తుంది 

అక్కడి నుండి మన హీరో సైడ్ ట్రాక్ ఎక్కవాల్సి వస్తుంది బ్యాంక్ సొమ్ముతో ఐటమ్స్ కొని వాటిని షాప్ వాళ్ళకి అమ్మటం ఇలా సైడ్ ట్రాక్ తో కథ ముందుకు జరుగుతుంది హీరో ఫైనాన్షియల్ background kuda మెరుగు పడుతుంది

హీరో ఏమి చేసినా అతనికి కలిసి వస్తుంది ఇలా బ్యాంక్ డబ్బుతో వ్యాపారం ,స్టాక్ మార్కెట్, లాటరీ, ఇలా అన్ని కలిసి వస్తాయి అయితే చివరికి కథ ఎలా ముగిసింది అన్నది అసలైన కథ 

పరవాలేదు బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!

Lucky bhaskar movie review!!!

5, నవంబర్ 2024, మంగళవారం

Ka movie review in telugu !!!

 

Ka movie review కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం !

కృష్ణ గిరి అనే ఒక గ్రామం అది 1970 ,80 కాలం ఆ ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడుతుంది ఆ ఊరిలోకి హీరో అభినవ్ వాసుదేవ్ కాంట్రాక్టు పోస్ట్ మెన్ కింద వెళ్తాడు అయితే హీరో ఒక అనాథ అనాథ ఆశ్రమం లో చిన్నప్పటి నుండి పెరుగుతాడు హీరో కి ఎవరు లేకపోవటం వల్ల అక్కడికి వచ్చే లెటర్ లు చదవటం చిన్నప్పటి నుండి చదవటం ఇష్టం 

అలా కృష్ణ గిరికి వెళ్లిన హీరో అక్కడ కు వచ్చిన లెటర్ లు కూడా చదువుతాడు అయితే ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతారు ka movie review 

అయితే అక్కడ హీరోకి అసలు పరిస్థితులు కొత్త కొత్తగా ఉంటుంది అసలు ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుందో తెలీదు అక్కడ పోస్ట్ మాస్టర్ కూతురు తో ప్రేమలో పడతాడు 

అయితే ఇదంతా ఒక kidnaper కి చెబుతాడు హీరో జరిగిన కథంతా

అసలు ఆ ఊరిలో ఏమి జరుగుతుంది అసలు ఆ అమ్మాయిలు మిస్ అవ్వటానికి కారణం ఏమిటి అసలు ka అంటే ఏమిటి అన్నది మిగిలిన కథ 

కథ కొత్తగా ఉంది కాకపోతే కొద్దిగా లాగ్ ఎక్కువ అనిపించింది మొత్తానికి బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు kiran abbavaram సినిమాలు రొటీన్ సినిమాలు లాగా కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేసాడు సినిమా నాకు తమిళ్ సినిమా చూసినట్టు అనిపించింది 

మొత్తానికి బాగుంది ka movie review!!!

2, నవంబర్ 2024, శనివారం

Viswam OTT ?

 Viswam OTT గోపి చంద్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన విశ్వం మూవీ అప్పుడే ott లోకి వచ్చేసింది కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ శ్రీను వైట్ల నుండి వచ్చిన సినిమా అక్టోబర్ 11 న థియేటర్ లలో విడుదల అయిన సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉంది 

Viswam OTT Release !!!

కర్మ ఫలం !!!

 #కర్మ_ఫలం #పుణ్య_ఫలం   చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...