4, సెప్టెంబర్ 2024, బుధవారం

సరిపోదా శనివారం మూవీ పై నా అభిప్రాయం !!!

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా సరిపోదా శనివారం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక మధ్య తరగతి ఫ్యామిలీ ఉంటుంది అమ్మ,నాన్న,అక్క తమ్ముడు అయితే అమ్మ ఒక జబ్బుతో బాధపడుతుంది ఎక్కువ కాలం బ్రతకదు అయితే కొడుకుకి కోపం ఎక్కువ ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే వెంటనే కొట్టేస్తాడు
అది వాళ్ళ అమ్మకు ఉన్న కోపం కొడుకుకి వస్తుంది అయితే వాళ్ళ అమ్మ చివరి రోజులలో ఒక మాట తీసుకుంటుంది తను వారానికి ఒకసారి మాత్రమే కొట్టాలని తనకి కోపం తెచ్చినవారిని పేరుని రాసుకుని వారిని శనివారం మాత్రమే కొట్ట మని చెబుతుంది
మరోపక్క విలన్ ఆ ఏరియా CI దయaనంద్  తన అన్నకు ,తనకు ఆస్తి వివాదం ఉంటుంది తన అన్నని కార్పొరేటర్ చేసిన సోకుల పాలెం ప్రజలు అంటే అసలు ఇష్టం ఉండదు 
తన అన్న మీద కోపం వచ్చిన ప్రతి సారి సొకుల పాలెం వారిని ఎవరో ఒకరిని తీసుకువచ్చి చావా గొడుతుంటాడు 
ఇంక హీరోయిన్ హీరో చిన్నప్పటి మరదలు హీరో మావయ్య కూతురు తాగేసి తన అత్తను కొడుతుంటే హీరో వాళ్ళ అమ్మ వేరే చోటికి పంపించివేస్తుంది ఆ కోపంతో హీరో వాళ్ళ మావయ్య అమ్మను అస్తమాటు తిడుతుంటాడు
ఈ విధంగా కోపం ఎక్కువగా ఉండే హీరోకి, ఆ ఏరియా CI కి గొడవ ఎలా జరిగింది కథ ముందుకు ఎలా వెళ్ళింది అన్నది మిగిలిన కథ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా లలో కొద్దిగా బెటర్ అనిపించింది సినిమా పరవాలేదు ఒకసారి చూడవచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...