4, మే 2021, మంగళవారం

కరోనా కంటే దాని జాగ్రత్తలు కలవరపెడుతున్నాయి !!!

 అవును ఈ కరోనా ఏమో గాని జాగ్రత్తలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు ఒకరు ఆవిరి పట్టమని, మరొకరు ఆవిరి వద్దని, ఒక్కరు చద్దన్నం తినమని, మరొకరు నిమ్మరసం తాగమని, మరొకరు బిళ్ళలు వేసుకోమని 

ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతూ వెళ్తున్నారు అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు 

ఏమి పరిస్థితులు రా బాబు ఇంట్లో టి వి న్యూస్ చానెల్స్ చూడాలంటే భయం, బయటకు ఎక్కడికి వెళ్లాలన్న భయం అసలు ఈ స్థితి నుండి ఎప్పుడు బయట పడతామో ఏమో ఎంత ధైర్యం తెచుకుందామన్న ఎదో తెలియని భయం !!!

ఈ పుకార్లు విరుగుడు కార్యక్రమాలు ఇవన్నీ ఎంత వరకు పని చేస్తాయో తెలీదు జబ్బు కన్నా ముందు భయం చంపేస్తుంది మనుషుల్ని 

అవును నాకు తెలిసి చాలామంది భయంతోనే చనిపోతున్నారు !!!

ఎప్పుడు మంచి పరిస్థితులు వస్తాయో ఏమో అసలు అర్థం కావటం లేదు 😢😢😢

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...