13, మే 2021, గురువారం

నరకం అంటే ఇదేనేమో ?

 స్వర్గం, నరకం అంటే ఎక్కడో ఉంటాయి అది మనం కాలం చేసిన తరువాత తెలుస్తుంది అనుకున్నాం కానీ స్వర్గం, నరకం అంటే మనం బ్రతికే బ్రతుకే దానిని నిర్ణయిస్తుంది

అవును నిజం ఇప్పటి పరిస్థితి చూస్తే అలానే ఉంది నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగినవారే ఈ రోజు మనకు దూరం అవుతున్నారు కనీసం చివరి చూపులు కూడా నోచుకు పోవటం లేదు 

అంతా ఈ మాయదారి మహమ్మారి కరోనా వల్లే ఎప్పుడు ఇరగడు అవుతుందో ఏమో గాని చాలా మంది జీవితాల్ని నాశనం చేస్తుంది కొందరికి ఆరోగ్యం, కొందరికి ఆర్థిక పరిస్థితి, ఇలా చెప్పు కుంటూపోతే చాలానే ఉన్నాయి

కానీ ఇలాంటి పరిస్థితిలో ఓపిక ,సహనం, ధైర్యం ప్రతి మనిషికి చాలా అవసరం 

ఈ మహమ్మారి ఖచ్చితంగా ప్రతి మనిషిని తాకే వెళుతుంది కాకపోతే రోగ నిరోధక శక్తి ఉన్నవారు ఉండగలరు ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్త చాలా అవసరం !!!😢😢😢


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...