18, మే 2021, మంగళవారం

" ఆండ్రాయిడ్ కట్టప్ప " సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆండ్రాయిడ్ కట్టప్ప టైటిల్ కొత్తగా ఉంది కదూ కథ కూడా బాగుంటుంది ఇది ఆహా ott లో అందుబాటులో ఉంది మీకు నచ్చితే ఒక సారి చూడండి

సినిమా కథ విషయానికి వస్తే ఇది మలయాళం సినిమా తెలుగులో ఆహా ott లో విడుదల అయ్యింది కథ 

ఒక ఊరిలో తండ్రి , కొడుకులు ఇద్దరే ఉంటారు తండ్రి బాగా ముసలివాడు కొడుకు రోబోటిక్ ఇంజనీరింగ్ చదువుతాడు విదేశాలలో చాలా జాబ్ లు వస్తాయి కానీ ముసలి తండ్రిని వదిలి విదేశాలకు వెళ్ళటం ఇష్టం ఉండదు

ఒకసారి ఏదోలా తండ్రిని ఒప్పించి తనను చూసుకోవటానికి ఒక పని పనిషి ని ఇంట్లో ఉండమని తాను జపాన్ కు జాబ్ కు వెళ్తాడు

కానీ ఆ ముసలి తండ్రికి కొంచెం చాదస్తం ఎక్కువ ఇంటిలో అసలు మిషన్ పరికరాలు ఏమి ఉండటం ఇష్టం ఉండదు అంటే మిక్సీ, గ్రైండర్ వంటివి అయితే ఆ తండ్రి మిషన్ తో తయారు చేసిన వంటకాలు కూడా తాను తినడు చేతితో చేసిన వంటకాలు మాత్రమే తింటాడు

ఇలాంటి చదస్తపు ముసలి వాడితో పడలేక ఆ పని మనిషి వెళ్లి పోతుంది మళ్ళీ కొడుకుని ఇండియాకి రమ్మంటాడు

దీనికి బాగా పరిష్కారం ఆలోచించి తన కంపెనీ లోని రోబో తయారు చేసి తన తండ్రికి ఇస్తాడు అసలు మిషన్ అంటే ఇష్టం ఉండని ఆ ముసలి తండ్రికి ఆ రోబోకి ఎలా సన్నీ హిత్యం పెరిగింది అన్నది సినిమా కథ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా చాలా బాగుంటుంది

సినిమా చూసినంత సేపు ఆసక్తిగా చాలా బాగుంటుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!