28, ఏప్రిల్ 2025, సోమవారం
సారంగ పాణి జాతకం సినిమా పై నా అభిప్రాయం !!!
ప్రియ దర్శి హీరో గా చేసిన సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో కి జాతకం మీద నమ్మకం ఎక్కువ ఒక కారు షోరూం లో సేల్స్ మెన్ గా పనిచేస్తుంటాడు అయితే అదే షోరూం లో మేనేజర్ గా పనిచేస్తున్న మైథిలి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అయితే ఆ విషయం ఒక మంచి రోజు చూసుకుని మైధిలికి చెబుదామనుకునే అనే టైంలో ఆ మైథిలి తిరిగి i love you చెబుతుంది ఇంకా కథ సుఖాంతం అయ్యే టైంలో ఒక చేయిని చూసి జాతకం చెప్పే అవసరాల శ్రీనివాస్ హీరో చెయ్యి చూస్తాడు అయితే తన జీవితం అంతా బాగానే ఉంటుంది కానీ పెళ్లి జరుగుతుంది కానీ ఒక murder చేస్తావు అని చెబుతాడు అప్పటి నుండి హీరో తన ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తాడు
అయితే చివరికి murder చేశాడా ? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అన్నది కథ ఏదో కామెడీ గా ట్రై చేసారు ఒక సారి చూడ వచ్చు !!!
21, ఏప్రిల్ 2025, సోమవారం
ETV Win OTT లో విడుదల అయిన టుక్ టుక్ సినిమా పై నా అభిప్రాయం !!!
ETV Win OTT లో ఈ సినిమా అందుబాటులో దాదాపు నెల రోజులు అవుతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా చూడటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు సరదా జీవితం గడుపుతుంటారు కొమరం దశ నుండి యవ్వనం వయసులోకి వచ్చే దశలో ఉండే కుర్రాళ్ళు అయితే వాళ్ళకి ఒక కెమెరా కొని దానితో షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటారు అయితే దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అయితే దగ్గరలో వినాయక చవితి ఉండటంతో వినాయక చవితి వచ్చిన చందాలతో ఆ కెమెరాను కొనాలని అనుకుంటారు అయితే వినాయక చవితి అయిన తరువాత నిమజ్జనం కోసం వాళ్లకు బండి దొరకదు అయితే వాళ్లకు దగ్గరలో ఒక పాత chetak బండి దానిని కొంచెం మార్పులు చేర్పులు చేసి వినాయక నిమజ్జనం చేస్తారు
అయితే ఒక రోజు ఆ chetak బండిలో మార్పులు కనిపిస్తాయి ఆటోమేటిక్ గా ఆ బండిలో లైట్స్ వెళ్ళటం బండి హ్యాండిల్ అటు ఇటు తిరగటం అయితే బండి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ
అయితే ఆ బండిలో ఆ ముగ్గురు కుర్రాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటారు ఇంతకు అందులో ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది ఆ అమ్మాయి కథ ఏమిటి ఆ అమ్మాయి ఆత్మ ఆ బండిలోకి ఎలా వచ్చింది అన్నది మిగిలిన కథ బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!
18, ఏప్రిల్ 2025, శుక్రవారం
Sony LIV OTT లో విడుదల అయిన Rekha chitram సినిమా పై నా అభిప్రాయం !!!
Rekha chitram సినిమా ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో sony LIV OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో రెండు మాటల్లో !!!
ఈ సినిమా లో హీరో asif ali ఒక పోలీస్ ఆఫీసర్ అయితే సస్పెండ్ అయ్యి ఆ రోజు డ్యూటీలో జాయిన్ అవుతాడు అయితే అనుకోకుండా ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఒక చోట కూర్చుని మందు తాగుతూ ఫోన్ లో లైవ్ లో రికార్డు చేస్తూ తను ఇంకా ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక అమ్మాయిని తను కూర్చొన్న చోటు లోనే తనను పాతి పెట్టమని ఆ పాపం తనను వెంటాడుతుందని గన్ తో షూట్ చేసుకుని చనిపోతాడు
అయితే ఆ కేసు మన హీరో ఆ కేసు ను ఎలా పరిష్కరించాడు అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ ఇది మలయాళం డబ్బింగ్ సినిమా కాబట్టి మొదట్లో కొంచెం బోరింగ్ గా మొదలవుతుంది ఉండే కొలది బాగుంది సస్పెన్స్ సినిమాలు ఇలాగే ఉంటాయి
హీరోయిన్ అవుదామనుకుని వచ్చిన అమ్మాయిని ఎవరు చంపారు ఆ నలుగురు వ్యక్తులకు ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి అన్నది మిగిలిన కథ !!!
14, ఏప్రిల్ 2025, సోమవారం
Netflix లో విడుదల అయిన Perusu సినిమా పై నా అభిప్రాయం !!!
Perusu movie review ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ తెలుగులో అందుబాటులో netflix OTT లో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమాలో పరంధామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు తనకు ఇద్దరు కొడుకులు, భార్య తో ఉంటాడు అయితే ఆ ఊరిలో ఒక కుర్రాడిని అడ్వాళ్లు స్నానం చేస్తుండగా చూస్తున్నాడని ఆ కుర్రాడిని కొడతాడు ఆ కుర్రాడు అది మనసులో పెట్టుకుని ఎలాగైన ఆ పరంధామయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు అయితే ఇంటికి వెళ్ళిన తరువాత అనూహ్యంగా చనిపోతాడు ఆ పరంధామయ్య అయితే ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది అది ఏమిటంటే తను చనిపోయిన తరువాత తన అంగం అలాగే లేచి ఉంటుంది అయితే అది ఫ్యామిలీ మెంబెర్స్ మొదట కంగారు పడతారు అయితే ఆ విషయం బయట జనాలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని ఆ వచ్చిన చుట్టాలతో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు
ఇలాంటి సినిమా అసలు ఎందుకు తీసారో తెలియదు పిల్లలతో ,కుటుంబంతో అసలు చూడలేము కొద్దిగా అసహ్య భావనతో చూడవలసి వచ్చింది సినిమా ఏదో కామెడీగా ట్రై చేసారు కానీ చూడటానికి కొంచెం ఎబ్బెట్టు గా ఉంది మరి నేనెందుకు చూసాను అనకండి అది నా పిచి సినిమా పిచ్చి !!!
12, ఏప్రిల్ 2025, శనివారం
Sony liv OTT లో విడుదల అయిన pravinkoodu shoppu సినిమా పై నా అభిప్రాయం !!!
బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన pravin koodu shoppu సినిమా మలయాళం డబ్బింగ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది సోనీ లైవ్ ott లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో బేసిల్ జోసెఫ్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు ఒక ఊరిలో ఒక కళ్ళు దుకాణం ఉంటుంది అయితే అక్కడ ఒక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు అయితే అక్కడే కొంతమంది పేకాట ఆడుతూ ,కళ్ళు తాగుతూ ఉంటారు అయితే ఆ హత్య ఎవరు చేసారు అన్నది మిగిలిన కథ
ఈ కథ కొద్దిగా బోరింగ్ గా మొదలవుతుంది చివరకు చూడగా చూడగా బాగుంటుంది అసలు ఆ హత్య ఎవరు చేసారు ఎందుకు చేశారు అన్నది హీరో అదే పోలీస్ ఆఫీసర్ బేసిల్ జోసెఫ్ ఎలా ఆ కేసు ను పరిష్కరించాడు అన్నది కథ బాగానే ఉంది కాకపోతే మరి అంత ఆసక్తి అయితే అనిపించలేదు నాకు
ఈ సినిమా కేవలం బేసిల్ జోసెఫ్ కోసం మాత్రమే చూసాను !!!
5, ఏప్రిల్ 2025, శనివారం
Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!
మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
సిద్దార్థ్ ఒక క్రికెటర్ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం ఆ ఆట కోసం ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇష్టం అయితే చెన్నై లో జరిగే అంతర్జాతీయ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో తను ఒక ప్లేయర్ అయితే అదే అతని చివరి మ్యాచ్ అని అందరూ అనుకుంటారు అయితే తన భార్య మీరా జాస్మిన్ ఒక కొడుకు ఉంటాడు
మరో పక్క మాధవన్, నయన తార భార్య భర్తలు 30 సంవత్సరాలు పైబడిన పిల్లలు పుట్టారు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతారు దానికి కూడా చాలా డబ్బులు కావాలి అయితే మాధవన్ ఒక సైంటిస్ట్ తను తయారు చేసిన ప్రాజెక్ట్ ప్రభుత్వ అనుమతి కోసం ఎన్ని సార్లు ట్రై చేసిన విఫలం అవుతాడు అయితే 50 లక్షలు ఉంటే ఆ ప్రాజెక్ట్ ok చేస్తానని చెబుతాడు అంతకు ముందు కూడా అప్పు చేస్తాడు మరల 50 లక్షలు అంటే ఎలా అని ఆలోచిస్తాడు
అయితే ఇందులో మాధవన్ కి, సిద్దార్థ్ కి అసలు సంబంధం ఏమిటి ఆ చెన్నై లో జరిగే టెస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అన్నది మిగిలిన కథ
మనిషి కి డబ్బు ఉంటేనే మనిషిని మనిషి గుర్తిస్తుంది ఈ సమాజం ఇందులో మంచివారు , చెడ్డవారు అని ఏమి ఉండదు డబ్బు ఆడే నాటకంలో అందరూ నటులే
ఈ సినిమా మొదట కొంచెం స్లో గా మొదలవుతుంది ఇదేమి సినిమా రా బాబు అనుకునేంతల తరువాత అసలు కథ మొదలవుతుంది డ్రామా గా మొదలవుతూ క్రైమ్ థ్రిల్లర్ గా నడుస్తుంది
మీకు సమయం ఉంటేనే చూడండి లేకపోతే స్కిప్ చేయండి !!!
4, ఏప్రిల్ 2025, శుక్రవారం
Home Town web series పై నా అభిప్రాయం !!!
హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది
90s వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు దానిలాగ ఇది కూడా అంటే ఈ కథ 2003 నుండి కథ మొదలవుతుంది ఇందులో రాజీవ్ కనకాల ఒక మధ్య తరగతి కుటుంబం తనకు భార్య, కొడుకు, కూతురు ఉంటారు అయితే తన లాగా తన పిల్లలు భవిష్యత్ మధ్య తరగతిలోనే కాకుండా valla భవిష్యత్ మరి ముఖ్యంగా కొడుకు విదేశాలకు పంపి మంచి భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటాడు అందుకోసం అబ్బాయి పేరు మీద పాలసీ తీసుకుంటాడు
అయితే యుక్త వయసులో ఉన్న కుర్రాడికి ఎలాంటి ఆలోచనలు, చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో అలా ఉంటాడు అసలు చదువు అబ్బదు అమ్మాయి బాగా చదువుతుంది కానీ తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు
అయితే చివరికి కొడుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మిగిలిన కథ మొత్తం 2 గంటలు పైనే ఉంది
నేను 90 s web సిరీస్ చూసాను ఈ హోమ్ టౌన్ web series చూసాను రెండిటిలో నాకు 90 s వెబ్ సిరీస్ బాగుంది
ఇందులో మొత్తం 5 ఎపిసోడ్ లు ఉన్నాయి పరవాలేదు ఒకసారి చూడ వచ్చు !!!
3, ఏప్రిల్ 2025, గురువారం
కర్మ ఫలం !!!
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.
కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.
ఆ బస్సురెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
ఆ బస్సులో వున్న ఒక పెద్దయన ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి ,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి
మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.
చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు.
చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ ..బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు...కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!!
ఆ బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి
ఆ బస్సులో ఉండడం వల్లనే ...ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల..... ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల ,.. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం మారంత మృత్యువాత పడడం జరిగింది
"#కర్మ ఫలం"(పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు ...
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అని అనుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం మన
తల్లిదండ్రులది కావచ్చు!
జీవిత భాగస్వామిది కావచ్చు!
పిల్లలది కావచ్చు!
తోబుట్టువులది కావచ్చు!
మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది #పుణ్య ఫలితం, #ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు.
ఒక సినిమాలో చెప్పినట్లుగా…”బాగుండడం” అంటే 'బాగా'.. ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా కలసి ఉండడం అని అర్థం !!!
కష్టాలు మన మంచికే !!!
కష్టాలు_మన_మంచికే
ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు... ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు?
శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు... నేనో చిన్నకథ చెప్తాను వింటావా?
తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు...
ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుక గా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు..
ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రం లోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.
తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను..
ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే, దాని శరీరం లోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది. కాని అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు.
అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది..
అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.
సర్వేజనా సుఖినోభవంతు !!!
అన్నదానం మహిమ !!!
#అన్నదాన_మహిమ 🙏
పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తనయింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినాసరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక, ఒకనాడాయనకు అన్నదానంవల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.
ఒకాయన ఏమన్నాడంటే, " అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.
అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.
ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు.
దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై 'నీకేం కావాలి?' అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, " అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు " అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.
అప్పుడు దేవి అతనితో “నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు , అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబు తాను, విను:
హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయనదగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషిoచి, ' బాబూ మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, 'నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ' అని ' చెప్పు. 'ఇంతేగదా ?' అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని 'అన్నదానంవల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?' అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.
బ్రాహ్మణుడు 'సరే' అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పి పోయాడు. దారితెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అని ఆత్రముతో అడిగాడు.
హేమవత పర్వతం దగ్గరికి పోవాలి' అన్నాడు బ్రాహ్మడు.
"బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్ర మయిపోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి” అన్నాడు బోయవాడు.
బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లేడు.
చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్తకుoడ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు.
బ్రాహ్మడు, 'నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో' అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.
బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కిందపడుకోబోకండి. పులులు వస్తాయి ' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.
బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడనుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది.
బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తనమూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బాహ్మణునితో “స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను , నడవండి" అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది.
ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. ' పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాల'ని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు.
రాజు గారి భార్య తొమ్మిది నెలలు మోసి, చందమామ లాంటి పిల్ల వాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్ల వాణ్ణి, ' అన్న దానంవల్ల కలిగే ఫలమేమిటో చెప్పు ' అని అడిగేడు.
అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్ద వానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో యిలా అన్నాడు . “ పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చార పప్పూ, పురిషెడు తేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండీ ! ఈమాత్రపు దానానికే ఈ రాజు గారికి కుమారుడైయి పుట్టి, రాజ్య మేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు, నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి."
ఇలా చెప్పేసి, ఆ పిల్లవాడు మరుక్షణం లోనే ఏమీ ఎరుగని పసిపాపలాగ 'తువ్వా, కువ్వా' అని ఏడవడం ఆరంభించాడు.
బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి, తన వూరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పేడు. ఆ దంపతులు అప్పటినించి విడవకుండా అన్న దానం చేస్తూ ధన ధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు !!!
ఛత్రపతి శివాజీ వర్ధంతి నేడు !!!
#చత్రపతి_శివాజీ_వర్ధంతి 🙏
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శివాజీ సా.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది.
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు !!!
శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!
శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...