పశ్చిమ గోదావరి జిల్లా లోని తేతలి గ్రామంలో వెలసిన శ్రీ రాజేశ్వర స్వామి వారి దేవాలయం శివరాత్రి సందర్భంగా !!!
27, ఫిబ్రవరి 2025, గురువారం
నత్త రామేశ్వరం రథం ఊరేగింపు వీడియో !!!
మహా శివరాత్రి సందర్భంగా 26/02/2025 నత్త రామేశ్వరం గ్రామంలో రథం ఊరేగింపు జరిగింది దానికి సంబంధించిన వీడియో మీ కోసం
మహా శివ రాత్రి శుభాకాంక్షలు !!!!!!
#మహాశివరాత్రి 🙏
_*శివరాత్రి అంటే ? శివరాత్రి పూజావిధానం ఎలా చేయాలి
_వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
*☘శివరాత్రులు ఎన్ని ?☘*
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
నిత్య శివరాత్రి ,
పక్ష శివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే 'శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే !
అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా – ‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’
అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.
☘ఉపవాసం అంటే ఏమిటి ?☘
దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘
విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”
వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.
అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.
శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
☘ప్రదక్షణ విధులు☘
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.
☘బిల్వ దళం ప్రాముఖ్యత:☘
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది !!!
24, ఫిబ్రవరి 2025, సోమవారం
అన్నదాత సుఖీ భవ !!!
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్న్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం ఇచ్చినా యెంతో పుణ్యదాయకం.
ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో..!! యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలిగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు.
నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో..!!
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున , “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్క కు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది !!!
23, ఫిబ్రవరి 2025, ఆదివారం
సంక్రాంతికి వస్తున్నాం OTT !!!
సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇందులో జీ5 ఓటీటీ, జీ తెలుగు టెలివిజన్ రెండూ ఉన్నాయి. జీ ఇప్పుడు అధికారికంగా సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ తేదీ ప్రకటించింది. మార్చ్ 1వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది!!!
చిన్న నాటి జ్ఞాపకం !!!
చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి, ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం...
కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!
ఇప్పుడు పెద్దయ్యాక -
మనం కొనుక్కుని తినే టైంకి...
అదేంటో ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు...
దాంతో మధ్యతరగతి & పెద్దోళ్ళ మధ్య ఆ అంతరం అలాగే ఉండిపోయింది...
చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు...
అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు...
టెర్లిన్ వస్త్రాలు అది ఖరీదైనవి మన మధ్యతరగతి అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!
అదేంటో పెద్దయ్యాక -
మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే...
వాళ్ళు - కాటన్ కు దిగారు... ఇప్పుడు ఆ కాటన్ దుస్తుల ధరే ఎక్కువ..!
దాంతో మధ్యతరగతి & పెద్దోళ్ళ మధ్య ఆ అంతరం అలాగే ఉండిపోయింది...
చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకు - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే... మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!
అదేంటో పెద్దయ్యాక చూస్తే -
జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని... ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు...!
దాంతో మధ్యతరగతి & పెద్దోళ్ళ మధ్య ఆ అంతరం అలాగే ఉండిపోయింది...
ఓ వయసులో మనకు తల్లిదండ్రులు - సైకిల్ కొనగలగడమే కష్టం. ఎలాగోలా
అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు...
మనం - స్కూటర్ కొనే సమయానికి..
వాళ్ళు కార్లలో తిరిగేవారు...
మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి...
వాళ్ళు BMW ల్లో తిరిగారు...
మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి...
అదేంటో వాళ్ళు ఆరోగ్యావసరాలతో ఖరీదైన సైకిల్స్ కోని సైక్లింగ్ చేస్తున్నారు..!
దాంతో ఇప్పటికి మధ్యతరగతి & పెద్దోళ్ళ మధ్య ఆ అంతరం అలాగే ఉండిపోయింది...
ప్రతి దశలో,
ప్రతి సమయాన,
విభిన్న మనుషుల మధ్య - స్థాయి, అంతరం అలాగే ఉండనే ఉంటుంది...
ఆ అంతరం - నిరంతరం ఎప్పటికి ఉండి తీరుతుంది...
కాబట్టి
రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని...
మళ్ళీ రేపటిరోజున - గతించిన ఇవాళ్టి గురించి, చింతించేకంటే...!
ఇవాళ అందినదానితో, ఉన్నదానితో ఆనందిస్తూ.. సంతోషంగా ఆస్వాదిస్తూ..
భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ..
రేపటికి స్వాగతం పలకడం నేర్చుకోవడం ఉత్తమం, శ్రేయస్కరం అని నా అభిప్రాయం, అభిప్రాయం మాత్రమే !!!
ధనరాజ్ "రామం రాఘవం" సినిమా పై నా అభిప్రాయం !!!
కమెడియన్ ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
మదురై మీనాక్షి అమ్మవారి పీటర్ పాదుకలు !!!
ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. "పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవలారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది !!!
21, ఫిబ్రవరి 2025, శుక్రవారం
మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలు !!!
" విజ్ఞానానికి - విలువలకు ,
ఆలోచనకు - అవగాహనకు ,
సంస్కృతులకు - సహకారానికి ,
భావోద్వేగానికి - భావవ్యక్తీకరణకు ,
మమకారానికి - మధురానుభూతులకు ... ఆలవాలం అమ్మ భాష "
ప్రపంచంలో ఎన్నో జాతులు .. మరెన్నో భాషలు . ఎన్ని భాషలున్నా మాతృభాష పంచే మాధుర్యం ముందు మరేది సాటి రాదు . జీవనోపాధికి ఎన్ని భాషలు నేర్చుకున్నా భావాన్ని ప్రస్పుటంగా తెలుపగలిగలిగేది అమ్మ భాషలోనే . ఎందుకంటే భావోద్వేగాన్ని స్పష్టంగా ఎదుటివారికి తెలిపేందుకు మాతృభాషను మించిన సాధనం మరొకటి లేదు . ఒక ప్రాంత సంస్కృతి , సాంప్రదాయాలకు అద్దం పట్టేది మాతృభాష . అందుకే , అమ్మభాషను రక్షించుకోవడానికి యునెస్కో ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది .
ఫిబ్రవరి 21 నే ఎందుకు ..!?
అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21 న నిర్వహించాలని యునెస్కో 30 బ సాధారణ మహాసభ 1999 లో ప్రకటించింది . ఈరోజు ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ . దేశ విభజన అనంతరం బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్ గా పిలిచేవారు . వారి మాతృభాష బెంగాలీ . కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు . అందుకే , తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు . ఆ ఉద్యమం 1952 నుండి నాలుగేళ్ల పాటు సాగింది . విద్యార్థులు , అధ్యాపకులు , ఉపాధ్యాయులు , ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు . చివరగా దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956 లో బెంగాలీ , ఉర్ధూ భాషలను అధికార భాషలు చేసింది . బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 21 న మాతృభాష దినోత్సవం గా జరిపేందుకు సిధ్దమైంది . ఈ ప్రతిపాదనను భారత్ సహా 29 దేశాలు మద్దతిచ్చాయి !!!
19, ఫిబ్రవరి 2025, బుధవారం
చత్ర పతి శివాజీ జయంతి !!!
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.
శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది.
షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు ఇప్పుడు సినిమా కూడా వచ్చింది థియేటర్ లలో వచ్చింది !!!
15, ఫిబ్రవరి 2025, శనివారం
Subservience Movie Review in Telugu !!!
ఈ సినిమా ఇంగ్లీష్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది amzon prime లో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరోకి, భార్య, ఒక పాప ,చిన్న బాబు కూడా ఉంటాడు అయితే హీరో భార్యకి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అందుకే ఇంటి పనులు చేయటానికి ఒక రోబో కొంటాడు అయితే ఆ రోబో కి మనిషికి ఉన్నట్టు ఫీలింగ్స్ అన్ని ఉంటాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ కి చాలా దగ్గర అవుతుంది హీరోకి కూడా phisical గా దగ్గర అవుతుంది
అయితే అక్కడినుండి అసలు సమస్యలు మొదలు అవుతుంది వాళ్ళ భార్య ఆపరేషన్ జరిగి ఇంటికి వస్తుంది అక్కడి నుండి ఇంటిలో గొడవలు జరుగుతాయి
ఒక మనిషి జీవితంలోకి రోబోట్స్ వస్తే వాటికి ఫీలింగ్స్ అంటే ఏంటి అసలు జీవితాలలో ఎలా తారు మారు అవుతాయి అన్నది కథ అక్కడక్కడ కొన్ని సీన్స్ పెద్దవారికి మాత్రమే !!!
13, ఫిబ్రవరి 2025, గురువారం
జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు !!!
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి . సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా !!!
ప్రపంచ రేడియో దినోత్సవ February 13 !!!
రేడియో దినోత్సవం
సమాచార సాంకేతిక విజ్ఞానం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా...
యునెస్కో 2012 నుంచి ఏటా ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో_దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
అందరి హృదయాల్లో పదిలంగా నిలిచే ప్రసార సాధనం రేడియో!
సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే అత్యంత ప్రాచీన మాధ్యమమిది. అక్షరాస్యులు కానివారికీ సులభగ్రాహ్యమైన సాధనం... రేడియో.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 75శాతానికిపైగా గృహిణులు ఇప్పటికీ వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపైనే ఆధారపడుతున్నారని అంచనా.
ఎన్ని టీవీ ఛానళ్లు, వార్తా పత్రికలున్నా ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితుల స్థితిగతులు తెలుసుకొని, త్వరితగతిన సమాచారం చేరవేసి, విలయంనుంచి వారిని కాపాడేందుకు ఉపయోగించే సాధనమిదే. యుద్ధాల్లో పాల్గొనే సైనికులు, సరిహద్దుల్లో పహరా కాసే జవాన్లకు సమాచారం అందజేసే సాధనమూ ఇదే. కాలక్రమేణా రేడియో రూపురేఖలు మార్చుకుని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుని... మానవ జీవితంలో విడదీయలేని భాగంగా మారింది!
తొలినాళ్లలో రేడియో సెట్లలో ఇప్పటిలా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావు. నాటి రేడియో నమూనాలను క్రిస్టల్‌నెట్ అనేవారు. భారత్‌లో తొలి రేడియో స్టేషన్ బ్రిటిష్ హయాములో బాంబేలో ప్రారంభమైంది. 1923 జులై 23న ఆ స్టేషన్ నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 1936లో ఆల్ ఇండియా రేడియోగా అవతరించింది. తెలుగువారి తొలి రేడియో ఆకాశవాణి మద్రాసు కేంద్రం.
ఈ ప్రసారాలు 1938 జూన్ 16న ప్రారంభమయ్యాయి. ‘నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుతున్నాను... మీరెక్కడినుంచి వింటున్నారో చెప్పజాలను’ అంటూ నాడు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారతదేశం-రేడియో’ అనే అంశంపై ప్రసంగిస్తూ మాట్లాడిన తొలిపలుకులతో, వేన్కుడు సుబ్రమణ్యపిళ్ళై నాదస్వరం వాయిస్తుండగా తొలి తెలుగు రేడియో ప్రసారాలు ప్రాణం పోసుకున్నాయి.
ఒకప్పుడు సమాచార మార్పిడికి మాత్రమే పరిమితమైన ఈ సాధనం- కాలక్రమేణా కొత్తపుంతలు తొక్కుతూ ఇంటింటి బంధువయింది. విద్య, వినోదం, విజ్ఞానం, నాటకం, వార్తా ప్రసారం, శాస్త్రీయ-జానపద సంగీతం, రైతులు, మహిళలు, పిల్లలు, క్రీడలు వంటి అనేక అంశాలను సమపాళ్లలో మేళవించి భిన్న వర్గాలను ఆకట్టుకుంటోంది.
ప్రధానమంత్రి మోదీ సైతం ‘మన్ కీ బాత్’ పేరిట దేశ ప్రజలతో అభిప్రాయాలను పంచుకునేందుకు రేడియో మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నారు. పాతతరం రేడియోతో పోలిస్తే నేడు రేడియోను వినే వారి అభిరుచులూ మారాయి. అందుకే కొన్ని రేడియో కేంద్రాలు ‘పాడ్ కాస్ట్’ల రూపంలో ప్రముఖుల మాటలనూ శ్రోతలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.
కాలానుగుణంగా తీరు మార్చుకుంటూ సమాజంతో గొంతు కలుపుతున్న రేడియోది... ప్రజా హృదయాల్లో చెరిగిపోని స్థానం!!!
10, ఫిబ్రవరి 2025, సోమవారం
గుణ పాఠం!!!
#తృప్తి
ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు.
కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు.
సాధువుకు సంతోషం వేసింది . ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు.
తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ‘‘ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.
నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు.
రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు.
సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు.
ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు.
అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు.
రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు.
నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం.
ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!
ధనదాహం, కోరికలు ఉన్నవారికి గుణపాఠం !!!
9, ఫిబ్రవరి 2025, ఆదివారం
వివేకానంద్ వైరలు మూవీ రివ్యూ !!!
ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో కి ఒక గవర్నమెంట్ జాబ్ అయితే రోజు అవేవో ఆయుర్వేద చూర్ణలు తిని అవి పాలలో,మందులో కలుపుకుని రోజూ తన భార్యను హింసిస్తూ శృంగారం చేస్తుంటాడు వాళ్ళ భార్యది కూడా అదే ఊరిలో పంచాయతీ ఆఫీసులో గవర్నమెంట్ జాబ్ అయితే హీరో పట్టణంలో పని చేస్తుంటాడు ఆ పట్టణంలో మరొక అమ్మాయితో సహజీవనం చేస్తుంటాడు
ఆ అమ్మాయితో కూడా ఇలాగ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు అయితే ఆ అమ్మాయి కాకుండా ఏ అమ్మాయి కనిపించిన వాళ్ళతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు అయితే ఇది భరించలేని సహజీవనం చేస్తున్న అమ్మాయి హీరో నిజ స్వరూపం బయట పెట్టాలని చూస్తుంది మొదటగా హీరో వాళ్ళ భార్య కి ఈ విషయం గురించి చెపుతుంది
అయితే ఆ తరువాత కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ ఈ కథ చివరకు ఎలా ముగిసింది నిజంగా భార్యలు మీద కొంతమంది భర్తలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు వాళ్లకు ఎలా ఎదురించలో తెలియక బాధ పడతారు ఎవరకు చెప్పుకోలేక అలాంటి వారికోసమే తీసినట్టుంది ఈ సినిమా చూడండి బాగానే ఉంది సినిమా కానీ కొన్ని సీన్ లు పెద్దవారికి మాత్రమే !!!
8, ఫిబ్రవరి 2025, శనివారం
Thandel movie review !!!
Thandel movie review అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన thandel సినిమా ఫిబ్రవరి 7 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఒకసారి చూద్దాం !!!
ఇది శ్రీకాకుళం లోని ఒక చేపలు పట్టే కుటుంబంలో ఉన్న రాజు , సత్య అదే నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమించుకుంటూ ఉంటారు అయితే రాజు వాళ్ళు ఉన్న ముఠా కి నాయకుడు అదే తడేల్ అవుతాడు అయితే చేపల వేటకు వెళ్ళకూడదు అంటుంది కానీ తను నమ్ముకున్న తన ముఠా కోసం నాగ చైతన్య సత్య నీ వదిలి వెళ్ళక తప్పని సరి పరిస్థితి అయితే ఇలాంటి సమయంలో రాజు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? సత్యని వదిలి వెళ్ళాడా లేదా అన్నది మిగిలిన కథ
ఈ సినిమా లవ్ స్టోరి గా మొదలై మధ్యలో హీరో పాకిస్తాన్ చెరలో ఉంటాడు అక్కడినుండి దేశ భక్తి తో చివరకు అంతం అవుతుంది !!!
5, ఫిబ్రవరి 2025, బుధవారం
రథ సప్తమి శుభాకాంక్షలు !!!
హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.
సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే !!!
రథ సప్తమి శుభాకాంక్షలు !!!
2, ఫిబ్రవరి 2025, ఆదివారం
The secret of shiledars వెబ్ సిరీస్ పై నా అభిప్రాయం !!!
The secret of shiledars Web series disney hotstar లో అందుబాటులో అన్డింక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ కథ ఛత్రపతి శివాజీ యొక్క ఖజానా కాపాడటానికి శివాజీ యొక్క సైన్యం అదే shiledars అంటారు వారు ఆ ఖజానా నీ ఎలా కాపాడారు అన్నది మిగిలిన కథ
ఇందులో హీరో డాక్టర్ శివాజీ సైన్యం అదే shiledars ఒకరు అయిన కోర్టు జడ్జి ఒక మీటింగులో మన హీరో కలుసుంటాడు అయితే హీరో యొక్క చరిత్ర గురించి హీరో కి చెప్పటం జరుగుతుంది అసలు హీరో గటం ఏమిటి ఆ శివాజీ సైన్యానికి, హీరోకి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ
మొత్తానికి బాగుంది 3 గంటలు 30 నిమిషాలు పైనే ఉంది వెబ్ సిరీస్ నిడివి మొదట్లో కొంచెం నెమ్మదిగా మొదలైన మధ్యలో వెళ్లే కొలది బాగుంది ఖజానా నీ కనుగొనటానికి టాస్క్ లు టాస్క్ లుగా ఉంటుంది మొత్తానికి బాగుంది కాలక్షేపానికి ఒకసారి చూడ వచ్చు !!!
వసంత పంచమి విశిష్టత !!!
వసంత పంచమి విశిష్టత:
సరస్వతీదేవిని మాఘ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.
మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.
‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.
సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.
శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!
శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...