Skip to main content

స్వప్న సుందరి సినిమా పై నా అభిప్రాయం!!!

 డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమా స్వప్న సుందరి కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!

హీరోయిన్ ఒక మద్య తరగతి అమ్మాయి బంగారం షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. తండ్రి ఆరోగ్యం బాగోలేక మంచాన్ని పడి ఉంటాడు అమ్మ ,మూగ అక్క ఉంటారు అన్న ఉంటారు గాని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తాడు ఇంట్లో పద్ధతి  నచ్చక బయటికి వెళ్ళిపోతాడు అయితే బంగారు షాప్ లో పనిచేస్తున్న హీరోయిన్ కి వాళ్ళ అన్నయ్య  తెలియకుండా కొంతమంది దగ్గర కమీషన్ తీసుకుని బంగారు నగలు కొనిస్తాడు వాళ్ళు ఒక లక్కీ కూపన్ వస్తుంది అది తన చెల్లికి తెలిసి అడుగుతుంది అయితే వెంటనే ఆ  కూపన్  తన చెల్లి మొహం మీద కొడతాడు అయితే దానిమీద హీరోయిన్ తన పేరు రాసి బాక్స్ లో వేస్తుంది

 అనుకోకుండా ఆ కూపన్ కి 10 లక్షల విలువ చేసే కారు బహుమతిగా వస్తుంది

ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి ఆ కారు వాళ్ళ జీవితాలను ఎలా మలుపు తెప్పింది అన్నది మిగిలిన కథ

ఐశ్వర్య రాజేష్ సినిమాలు బాగానే ఉంటాయి దురాశ దుఃఖానికి చేటు అనేది సినిమా రూపంలో ఈ కథలో మనకు తెలియజేయడమైనది

ఆ కారు వచ్చిన తర్వాత  వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అన్నది మిగిలిన కథ కామెడీగా బానే ఉంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒకసారి చూడవచ్చు!!!

(స్వప్న సుందరి మూవీ రివ్యూ)

Comments

Popular posts from this blog

ఓకే ఒక జీవితం సినిమా పై నా అభిప్రాయం !!!

శర్వానంద్,అక్కినేని అమల ప్రధాన పాత్రలో విడుదల అయిన ఓకే ఒక జీవితం సినిమా theatre లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఈ సినిమాలో హీరో కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు హీరోకి సంగీతం అంటే ఇష్టం మరొక ఫ్రెండ్ కి హౌస్ బ్రోకర్ గా పని చేస్తుంటాడు అలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇలా కథ ముందుకు వెళ్తుంటే ఒక సెంటిస్ట్ ఇల్లు అద్దెకు కావాలని హీరో ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు ఊరి చివర్లో ఇల్లు ఉండాలని అంటాడు అలాగే ఇల్లును చూపిస్తాడు తనతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్తాడు అప్పుడు ఆ సైంటిస్ట్ తను ఒక టైం ట్రావెల్ మిషన్ కనిపెట్టనని చెబుతాడు అప్పుడు వాళ్ళ ముగ్గురు వారి ఆశలు తీర్చుకోవటానికి a time mission లో ట్రావెల్ చేస్తారు అక్కడ వాళ్ళ చిన్నపాటి కాలానికి వెళ్తారు హీరో కి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం వాళ్ళ అమ్మను కలుసుకోవటం కోసం వెళ్తాడు అయితే అక్కడకు వెళ్ళిన తరువాత ఏటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ  బాగుంది సినిమా చూడ వచ్చు ఒకసారి !!!!  

"సీత రామం" సినిమా పై నా అభిప్రాయం !!!

    దుల్కర్ సల్మాన్ హీరో గా హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సీత రామం ఈ సినిమా మొన్న శుక్రవారం విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం !!! ఇందులో హీరో ఒక ఆర్మీ ఆఫీసర్ తనకంటూ ఎవరూ లేరు ఒక అనాధ ఉగ్రవాద దాడి జరగకుండా ఆపినందుకు all india radio నుండి ఒకావిడ హీరో ఇంటర్వ్యూ కి వస్తుంది అప్పడు హీరో తన గురించి అందరికీ చెబుతాడు తను ఒక అనాధ అని తనకు ఎవరు లేరు అని అప్పటి నుండి తనకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు అందులో సీత మహాలక్ష్మి తన భార్యనని ఉత్తరం రాస్తుంటుంది  ఐతే కథ ఇక్కడినుండి కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత చూపిస్తాడు ఇందులో రష్మీక మందన్న పాకిస్తానీ గా నటిస్తుంది అయితే తన తాత సీతామహాలక్ష్మి కి వెళ్లాల్సిన ఉత్తరం వాళ్ళ తాత దగ్గర ఉంటుంది ఐతే వాళ్ళ తాత దగ్గరికి వెళితే ఆ ఉత్తరం సీత మహాలక్ష్మి కి అందిస్తే తన తాత చివరి కోరిక కోసం హీరో, సీతామహాలక్ష్మి కోసం హైదరాబాద్ కు వస్తుంది  ఆ తరువాత అసలు రామ్, సీత లు గురించి ఏమి తెలుసుకుంది అన్నది మిగతా సినిమా కథ బాగుంది సినిమా 👍👍👍  కథ కొంచెం ముందుకు వెనకకు వెళ్తుంది కానీ ఓవరాల్ గా బాగుంది సినిమా !!!

" HIT the second case సినిమా పై నా అభిప్రాయం !!!

 అడవి శేష్ హీరోగా వచ్చిన సినిమా Hit 2 Nd case మొదటి సినిమా విస్వక్ సేన్ హీరోగా 2020 లో వచ్చింది ఇదే రెండవ సినిమా ఆ సినిమా బాగుంటుంది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో అడవి శేష్ ఒక  HIT  పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ జరుగుతుంది దానికి సంబంధించి నేరస్తుడిని వెంటనే పట్టుకుంటాడు అయితే మీడియా ముందు కొంచెం ఓవర్ గా ఫీల్ అవుతారు అయితే వెంటేనే కొన్ని రోజుల తరువాత మరొక అమ్మాయి మర్డర్ జరుగుతుంది అయితే ఆ అమ్మాయి తల మొండెం, కాళ్ళు, చేతులు వేరే వేరే మనిషులవి అయితే ఆ హత్య చేసింది ఒక కుర్రాడు అని అతడిని జైళ్లో వేస్తారు కానీ అక్కడ హత్య చేసింది ఆ కుర్రాడు కాదని తెలిసే లోపు ఆత్మ హత్య చేసుకుంటాడు ఇంతలో హీరో కొంచెం ఫీల్ అవుతాడు అయితే అప్పుడే హీరోయిన్ ని కూడా ఆ సైకో కిడ్నాప్ చేస్తాడు అయితే అసలు ఇదంతా చేస్తుంది ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఆడవాళ్ళను చంపుతున్నడు అన్నది సినిమా కథ మొదటి భాగం ఆసక్తిగా సాగుతుంది కానీ రెండవ భాగం నుండి అంత గా ఆసక్తిగా ఏమి సాగదు జస్ట్ అలా అలా వెళ్ళిపోతుంది  Hit మొదటి సినిమా సస్పెన్స్ తో చాలా బాగుంటుంది hit రెండవ భాగం అంతగా ఏమి లేదు అని చెప్పాలి జస్ట్ average అ