7, జూన్ 2022, మంగళవారం

విక్రమ్ సినిమా పై నా అభిప్రాయం !!!

కమల్ హాసన్, ఫేహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో చేసిన విక్రమ్ సినిమా విడుదల అయింది ఇక ఈ  సినిమా ఎలా ఉందో కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం లోకేష్ కనకరాజ్ direction లో వచ్చిన చిత్రం ఇది

ఇందులో 4 ముసుగు దొంగలు కొంతమందిని కిడ్నప్ చేసి చంపుతుంటారు అయితే వారిని పట్టుకోవడానికి ఫాహాద్ ఫాసిల్ స్పెషల్ టీం లో ఉండి అసలు ఆ హంతకులు ఎవరు అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అయితే అలా చనిపోయిన వారిలో కమల్ హాసన్ కూడా ఉంటాడు ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంటుంది అయితే చివరికి ఆ నలుగురిలో ఒకరు దొరుకుతాడు కానీ అసలు విషయం ఏమిటంటే అందులో కమల్ హాసన్ ఉంటాడు అదేంటి చనిపోయాడు అనుకున్న మనిషి ఎలా బ్రతికాడు అసలు కథ ఏమిటి ఇందులో విజయ్ సేతుపతి విలన్ కారెక్టర్ లో చేస్తాడు

అయితే ఈ కథలో అసలు కమల్ హాసన్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది చాలా సస్పెన్సు తో కూడుకున్న సినిమా ఇందులో మళ్ళీ లోకేష్ కనకరాజ్ చేసిన ఖైదీ సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి నిజం గా డైరెక్టర్ తెలివికి మెచ్చుకోవాలి బాగానే ఉంది కాని ఒకసారి చూడ వచ్చు అన్నట్టు ఇందులో చివరలో సూర్య కూడా ఉన్నాడు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!