21, జులై 2021, బుధవారం

" నారప్ప" సినిమా పై నా అభిప్రాయం !!!

 నారప్ప విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇది తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి రీమేక్ 

ఇక ఈ సినిమా ఎలాగ ఉందొ ఇప్పుడు చూద్దాం బహుశా వెంకీ మామా సినిమా తరువాత విక్టరీ వెంకటేష్ చేసిన సినిమా అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చింది 

కథ ఏమిటంటే నారప్ప ,తన భార్య సుందరమ్మ 

( ప్రియమణి) , మని కర్ణ, చిన్నప్ప, చిన్న పాపా, వాళ్ళ మావయ్య సాంబయ్య (రాజీవ్ కనకాల) ఒక ఊరిలో తమకున్న 3 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు అయితే ఆ ఊరిలో భూస్వామి పండు స్వామి ఆ ఊరిలో ఉన్న పొలాలన్ని తీసుకుని అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచిస్తాడు 

దానికి నారప్పకు ఉన్న 3 ఎకరాలు కూడా ఇవ్వమని అడుగుతాడు కానీ దానికి ఒప్పుకోడు నారప్ప దానితో వారిద్దరికీ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి 

నారప్ప పెద్ద కొడుకు మనికర్ణ ఆవేశ పరుడు తన తండ్రిని నారప్పని అవమానించారని పండు స్వామి ని చెప్పు తో కొడతాడు దానిని జీర్ణించుకోలేని పండు స్వామి మని కర్ణ ని చంపిస్తాడు 

ఆ తర్వాత మని కర్ణ తమ్ముడు మని కర్ణ తమ్ముడు చిన్నప్ప పండు స్వామి ని చంపేస్తాడు అంతే ఆ తరువాత కథ ఏమిటన్నది చూడాలి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు నారప్ప గతం ఎలాంటిది అనేది సినిమా కథ

రాయల సీమ భాషలో అడ్డాల శ్రీకాంత్ మాస్ చాలా బాగా డీల్ చేసాడు వెంకటేష్ తన నటనా చాలా బాగుంది

ఓవరాల్ గా సినిమా బాగుంది ఒకసారి చూడ వచ్చు !!!

1 కామెంట్‌:

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...