పృధ్వీ రాజ్ సుకుమార్ నటించిన I nobody సినిమా ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
ఒక సాధారణ వ్యక్తి (రాజీవన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక భారీ క్రైమ్ ముఠా బ్యాంక్ నుండి రూ. 17 కోట్ల రూపాయలను దోపిడీ చేస్తుంది. అయితే ఆ దోపిడీ నిందను ఏ పాపం ఎరుగని ఒక సామాన్యుడిపై మోపుతారు. అదే సమయంలో అతని కూతురు కూడా కిడ్నాప్‌కు గురవుతుంది. అవినీతి అధికారులు, గ్యాంగ్‌స్టర్ల ఒత్తిడి నడుమ ఆ తండ్రి తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? మాయమైన ఆ 17 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
కూడికలు :
- నటీనటుల నటన: పృథ్వీరాజ్ సుకుమారన్ తన సహజ నటనతో సినిమాను వన్‌మెన్ షోగా నడిపించారు. పార్వతి తిరువోతు, బాలనటి నక్షత్ర కీలక పాత్రల్లో చక్కటి అభినయం కనబరిచారు.
- ట్విస్టులు & స్క్రీన్‌ప్లే: సినిమా పొడవునా వచ్చే సస్పెన్స్ ట్విస్టులు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
- యాక్షన్ సీక్వెన్స్: ముఖ్యంగా లిఫ్ట్‌లో జరిగే యాక్షన్ సీన్ మరియు బస్సు ఫైట్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్‌లో అద్భుతంగా డిజైన్ చేశారు.
- సాంకేతిక వాల్యూస్: జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (RR) మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
తీసివేతలు :
- సినిమా నిడివి: సినిమా నిడివి దాదాపు 2 గంటల 46 నిమిషాల వరకు ఉండటం వల్ల అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్లు అనిపిస్తుంది.
- పాటలు & డైలాగ్స్: సినిమాలో పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు. అలాగే డైలాగ్స్ కూడా సాధారణంగానే అనిపిస్తాయి !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి