2, మార్చి 2025, ఆదివారం

తణుకు చరిత్ర తెలుసుకో ?

 తణుకు... 


స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాంతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుతుంది. ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని, అలాగే చాలా గ్రామాలకు పేర్లు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్రపురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు. ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉండడం గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది. అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు, పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు), చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం), వడ్లూరు అప్పటి ధాన్యాగారం, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం), ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు. అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది.


గోస్తని నది పుణ్య జలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. 


తణుకులోని కేశవరాయ దేవాలయంలోని మండపంలోని ఒక స్తంభంపై తెలుగులో వ్రాసిన శాసనం ఒకటి బయటపడింది.1443 శకం ఫిబ్రవరి 24న చెక్కినట్లుగా గుర్తించారు.

మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భగవద్గీత ఎందుకు చదవాలి ?

                  భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?    ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న  తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్...