14, మార్చి 2025, శుక్రవారం

Ponman సినిమా పై నా అభిప్రాయం !!!

 

సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయికి పెళ్లి కుదురుతుంది వాళ్ళ అన్నయ్య ఇంటి విషయాలు పట్టించుకోకుండా పార్టీ కోసం బలాదూర్ గా తిరుగుతుంటాడు అయితే పెళ్ళికొడుకు ఫ్యామిలీ పెళ్లి కూతురుకి 25 సవర్లు బంగారం అడుగుతారు అయితే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తి ద్వారా ఆ బంగారం ఇప్పిస్తాడు అయితే అయితే ఆ పెళ్ళిలో వచ్చిన చదివింపులు ద్వారా వచ్చిన డబ్బుతో ఆ 25 సవర్లు బంగారం  చెల్లుబాటు అయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంటారు అయితే పెళ్లి జరుగుతుంది 

ఆ పెళ్లి అయిన తరువాత వచ్చిన చదివింపులు 12 సావర్లు మాత్రమే ఉంటాయి మిగిలిన 13 సవార్లు బంగారం వాళ్ళు ఇవ్వరు అయితే వాటిని తిరిగి ఎలా సంపాదించాడు అన్నది మిగిలిన కథ 

చాలా సింపుల్ గా ఉంటుంది కానీ బాగుంది బంగారం మనిషిని ఎంత దిగజారుస్తుంది అన్నది ఈ సినిమా లో చూపించడం జరిగింది !!!

హోలీశుభాకాంక్షలు !!!

మనిషిలో ఎన్నో రంగులుంటాయి అవి సందర్భాన్ని బట్టి బయటకు వస్తాయి ఆ రంగులకు చిహ్నమే హోలీ 
రంగులు పూసే వారితో కాదు రంగులు మార్చే వారితో జాగ్రత్త 
హోలీ శుభాకాంక్షలు !!!

12, మార్చి 2025, బుధవారం

బల్లి పాడు శ్రీ మదన గోపాలస్వామి రథోత్సవం,మందు కాల్పు మహోత్సవం వీడియో !!!



 ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని బల్లి పాడు గ్రామంలో శ్రీ మదన గోపాల స్వామి రథోత్సవం, మరియు మందు కాల్పూ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన వీడియో మీ కోసం !!!

Chava సినిమా పై నా అభిప్రాయం !!!


 చావా సినిమా ఇది హిందీ సినిమా అయినప్పటికీ అన్ని భాషలలో విడుదల అవ్వాల్సిన సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అయ్యింది అనుకోండి అసలు ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!

ఛత్రపతి శివాజీ మరణం తరువాత మరాఠా సామ్రాజ్యం అంతా తన అధీనంలోకి వచ్చేస్తుంది అనుకుంటాడు ఔరంగా జెబ్ అయితే అప్పుడు వస్తాడు శంభజి మహారాజ్  తన అధీనంలో ఉన్న అన్ని రాజ్యాలు కోసం పొరడతాడు ఛత్రపతి శివాజీ ఔరంగ్ జేబ్  తో ఎంత యుద్ధం చేస్తాడో అలాగే శంబాజీ మహారాజ్ కూడా యుద్ధం చేస్తాడు  కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు అయితే శంభజీ మహారాజ్ నీ ఔరంగజేబు ఎలా పట్టుకున్నాడు 

అలా పట్టు కోవటానికి కారణం ఎవరు ? ఆ తరువాత ఔరంగజేబు షాంబాజీ మహారాజ్ నీ ఎన్ని చిత్ర హింసలు చేశాడు అన్నది మిగిలిన కథ !

మతం మారమని ఎంత ప్రయత్నించినా మార లేదు గోళ్ళు పీకి, ఎర్రగా కాల్చినా చువ్వలతో కంటిలో పొడిచి,నాలుక పీకి ఇంకా చాలా రకాలుగా హింసిస్తాడు అయిన మార లేదు నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండటం చాలా అదృష్టం మతం అంటే అమ్మ తో సమానం అని తను పుట్టిన మతం నుండి వేరొక మతంలోకి మారలేదు 

అయితే యూట్యూబ్ వీడియో లలో అక్కడే తల నరికి తన శరీరాన్ని ముక్కలు ముక్కలు గా నరికి చెరువులో పడవేశారు అని చూపెట్టడం జరిగింది నిజంగా ప్రతి హిందువు తప్పక చూడవలసిన సినిమా బాగుంది !!!

Kingston సినిమా పై నా అభిప్రాయం !!!


 A.R. రెహమాన్ మేనల్లుడు g.v prakash kumar నటించిన సినిమా కింగ్స్టన్ తమిళ్ సినిమా తెలుగులో మార్చ్ 7 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లాసయం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇది హార్రర్ కథాంశం తో నిండిన కథగా ఈ సినిమా నడుస్తుంది ఇందులో హీరో వాళ్ళు చేపల పట్టి జీవనం సాగిస్తుంటారు అయితే అనూహ్యంగా హీరో చిన్నప్పటి నుండి వాళ్లకు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు చనిపోతుంటారు అయితే అప్పటినుండి ఆ ప్రాంతంలో ఎవరు చేపలు పట్టటానికి వెళ్ళరు అయితే హీరో ఆ ఊరిలో ఉండే ఒక రౌడీ దగ్గర పనిచేస్తుంటాడు అయితే రౌడీ స్మగ్లింగ్ చేస్తుంటాడు ఆది తెలియక హీరో బృందంలో ఒకరు చని పోతాడు అప్పుడు హీరో తెలుస్తుంది అది డ్రగ్స్ అని ఆ రౌడీ తో గొడవపడి బయటకు వచ్చేస్తాడు హీరో అయితే వాళ్ళ దగ్గర ఉన్న సముద్రం తీర ప్రాంతంలో చేపలకు వెళ్లినవారు ఎందుకు చనిపోతున్నారు అని తెలుసుకోవటానికి హీరో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్తాడు అయితే అక్కడికి వెళ్లిన తరువాత హీరో ఎలాంటి పరిస్థితులు ఎదురుకొన్నాడు 

నిజంగా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయా అసలు ఈ పని ఎవరు చేస్తున్నారున్నది మిగిలిన కథ ఫస్ట్ ఆఫ్ అనత సో సో గా నడుస్తుంది 2nd హాఫ్ నుండి కొద్దిగా పరవాలేదు అనిపించింది సినిమా మొత్తానికి టైం నీ పాడు చేసుకుని చూడవద్దు సినిమా వన్ టైం వాచబుల్ అది కూడా ఏ సినిమా ఖాళీ లేకపోతే చూడండి అంతే ?

3, మార్చి 2025, సోమవారం

భగవద్గీత ఎందుకు చదవాలి ?


                  భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?

  

ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న 

తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. 


   రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న

బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటాడు. 


   మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…


   పొద్దున పూట తాతలానే తానూ 

భగవద్గీత చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…


    ఒకరోజు ’తాతా.. నువ్వు చదివినట్టు 

నేనూ భగవద్గీతను  చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే మర్చిపోతున్నాను. అసలు భగవద్గీతను  ఎందుకు చదవాలి? 

ఏంటి ప్రయోజనం’ అని తాతని 

అడిగాడు మనవడు.


   పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి..

‘కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..’ అని చెప్పారు.


‘సరే తాతా..’ అని మనవడు బుట్ట తీసుకెళ్ళి నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…


అది చూసి తాతగారు…’ఓరి మనవడా ఇంకొంచెం వేగం పెంచు...

ఇంటికి రావటంలో’ అని సలహా చెప్పారు! 


  సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు. ‘బుట్ట ఖాళీ తాతా! బుట్టలో 

నీళ్ళు ఎలా నిలుస్తాయి?  నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు.’ 


  తాత చెప్పాడు…’లేదు లేదు బుట్టతోనే 

నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…

ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని 

అవ్వచ్చు.’ అని మనవడిని 

ప్రోత్సహించారు…


   మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….


   ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..’ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…’అని…!


   మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది…!


   తాతగారు చెప్పారు…’భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధంలో    మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయంలో.. ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…

ఇవన్నీ అనుభవపూర్వకంగా..

ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు…’

అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు 

తాతగారు !!!

2, మార్చి 2025, ఆదివారం

తణుకు చరిత్ర తెలుసుకో ?

 తణుకు... 


స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాంతం అసురుల (రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్యపు రాజధానిగా చెప్పబడుతుంది. ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే తణుకు పట్టణానికి తారకేశ్వరపురం అన్న పూర్వనామం ఉండేదని, అలాగే చాలా గ్రామాలకు పేర్లు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్రపురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు. ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉండడం గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉంది. అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు, పాలంగి ఆ రోజులలో పూలంగి ( పూల కొట్టు), చివటం గ్రామం శ్రీవతం (ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం), వడ్లూరు అప్పటి ధాన్యాగారం, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం (బంగారం భద్రపరుచు ప్రాంతం), ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు. అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది.


గోస్తని నది పుణ్య జలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ప్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. 


తణుకులోని కేశవరాయ దేవాలయంలోని మండపంలోని ఒక స్తంభంపై తెలుగులో వ్రాసిన శాసనం ఒకటి బయటపడింది.1443 శకం ఫిబ్రవరి 24న చెక్కినట్లుగా గుర్తించారు.

మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కనిపిస్తూ ఉంది !!!

పులిహోర చరిత్ర ?

 పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో.. దాని వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకోండి..


పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర  నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఈ విషయం మనకు పురాణ కథలు,చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది.


కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు. కుళుత్తుంగ చోళుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టటం ఒక ఆచారంగా ఉండేదట. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ఈ పద్దతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచటం ప్రారంభం అయింది.


పులిహోరలో శుభానికి,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒక వైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతుంది. హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పటంతో కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది. పులిహోర అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టటం మనం చూస్తూనే ఉంటాం.


తిరుమల తిరుపతి లో పులిహోరను రాశి గా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు !!!

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...