28, మార్చి 2022, సోమవారం

"RRR" సినిమా పై నా అభిప్రాయం !!!

బాహుబలి తరువాత రాజమౌళి నుండి వచ్చిన చిత్రం  ఇద్దరు మాస్ హీరోలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఈ సినిమా అటు ఫాన్స్ కి, ఇటు సినీ వర్గాలకు అంచనాలు ఆకాశాన్ని దాటాయి 

ఎన్నో వాయిదాలు తరువాత march 25 విడుదల అయింది RRR సినిమా ఇక ఈ కథ ఏమిటో చూద్దాం !!!

ఈ కథ ఇద్దరు నిజమైన వ్యక్తులు నుండి తీసుకోబడిన కల్పిత కథ అని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు

ఈ కథ 1920 లో బ్రిటిషు వారి కాలంలో జరిగిన కథ గా చూపించాడు ఒక గిరిజన చిన్న అమ్మాయిని బ్రిటిష్ రాణి పచ్చ బొట్టు వేస్తుంది అయితే ఆ పచ్చ బొట్టు వేసే శైలి ఆ చిన్న అమ్మాయి  బ్రిటిష్ రాణి కి నచ్చటంతో ఆ చిన్న పిల్లను తన బంగ్లాకి తీసుకువెళ్లి పోతారు

ఆ అమ్మాయిని తరిగి తన ప్రాంతానికి తీసుకురావడానికి భీం ఎన్టీఆర్ ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి మారు వేషంలో వెళ్లి అక్కడ పనిచేస్తుంటాడు

అయితే అక్కడే రామ్ చరణ్ బ్రిటిష్ సైన్యంలో పోలీస్ గా పని చేసాడు అల్లూరి సీత రామరాజు ఐతే అక్కడ జరిగిన చిన్న ప్రమాదంలో చిన్న అబ్బాయిని కాపాడటానికి ఇద్దరు సాహసం చేసి ఆ అబ్బాయిని కాపాడతాడు అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అవుతారు

ఆ పిల్లను విడిపించటానికి భీం, బ్రిటిష్ వారి ఆజ్ఞలు అమలు చేసే రాం రాజు ఆ పిల్లని బీమ్ నుండి ఎలా కాపాడాడు ఇద్దరు చివరకు ఏమి జరిగింది ఇద్దరు స్నేహితులు కాస్త వారి వారి కర్తవ్యాన్ని ఎలా చేశారు అన్నది మిగిలిన సినిమా కథ

సినిమా మొత్తం నిడివి 3 గంటలు ఉంది అంత సేపు ప్రేక్షకుడిని సీట్ లో కూర్చోబెట్టడం అంటే ఎక్కడ బోర్ అవ్వకూడదు ఆ విషయం రాజా మౌళి కి బాగా తెలుసు కానీ సెకండ్ హాఫ్ నుండి సినిమా మొత్తం రామ్ చరణ్ వైపు హైలెట్ గా చూపించటం జరుగుతుంది 

ఇది ఎన్టీఆర్ ఫాన్స్ కి కొంచెం బాధ గా అనిపిస్తుంది మొత్తానికి పర్వాలేదు వన్ టైం వాచ్ చేయొచ్చు గ్రాఫిక్స్ కూడా రాజమౌళి నుండి ఆశించినంత ఏమి లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!