9, జులై 2018, సోమవారం

టెక్నాలజీ మనలో ఉన్న బద్దకాన్ని పెంచుతుందా ?



ఈ ప్రశ్నకు సమాధానం మనం రోజూ చేసే పనిలోనే మనకు అర్థం అవుతుంది ఇదివరకు పని చేయటానికి చాలా శ్రమ పడవలసి వచ్చేది కానీ నేడు ప్రతి పనికి టెక్నాలజీ పుణ్యమా అని మనిషి మరింత బద్దకాన్ని పెంచుతుంది
ఉదాహరణకు : బట్టలు ఇదివరకు చేతితో ఉతికేవారు కానీ నేడు వాషింగ్ మెషిన్ వాడుతున్నారు
                      పొయ్యి మీద వంట చేసే వారు నేడు గ్యాస్ స్టవ్, electrive స్టవ్ ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇవి మన శారీరక శ్రమను తగ్గించవచ్చు కానీ దీని వల్ల మనిషిలో ఉన్న బద్దకం మరింత పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు


మనిషికి శారీరక శ్రమ లేకపోవటం వల్లనే త్వరగా అనారోగ్యాలు పాలు అవ్వటం అనేది జగమెరిగిన సత్యం టెక్నాలజీ తెచ్చిన సౌకర్యాలు వల్ల మనిషి మరింత బద్ధకంగా తయారు అవుతున్నాడు ఏదైనా కొనటానికి అయిన సరే మనిషి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు టెక్నాలజీ అభివృద్ధి చెందటంలో తప్పు లేదు కానీ ఆ టెక్నాలజీ తో వచ్చే సౌకర్యాలకు మానవుడు బాగా అలవాటు పడిపోతున్నాడు !!!

తొలకరి చిరుజల్లు !!!


తొలకరి చిరుజల్లులో
మేను పులకరింపుగా
 సదా నీ పలకరింపుకి
ఎదురుచూస్తుంటుంది
             నా మది !!!

Tolakari chirujallulo
Menu palakarimpaga
Sada nee palakarimpuki
Eduruchustuntundi
       Naa madi !!!

కర్మ ఫలం !!!

 #కర్మ_ఫలం #పుణ్య_ఫలం   చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...