2, మార్చి 2023, గురువారం

" Farzi" వెబ్ series పై నా అభిప్రాయం !!!


 Amazon prime లో విడుదల అయిన  farzi web series Shahid Kapoor, విజయ్ సేతుపతి , రాశి ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ series family man web series తీసిన వారే ఈ వెబ్ series ను తీశారు ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఏ బొమ్మనైన చూసింది చూసినట్టు వేస్తాడు వాళ్ళ తాత క్రాంతి అనే పత్రిక నడుపుతుంటారు అయితే అది సరిగ్గా నడవక అప్పులు పాలు అవుతాడు అయితే తన తాతని ఎలాగైనా అప్పులు బాధ నుండి కాపాడాలని హీరో దొంగ నోట్లు అదే ప్రెస్స్ లో ముద్రిస్తుంటాడు 

అయితే మరోపక్క విజయ సేతుపతి స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ దొంగ నోట్లు ముద్రించే మసుర్ అనే వ్యక్తి నీ పట్టుకుంటాడు కానీ ఎలాగోలా తప్పించుకుంటాడు చివరికి masoor హీరో నీ కిడ్నాప్ చేసి తనకు దొంగ నోట్లు తయారు చేయమని చెబుతాడు హీరో తయారు చేసే దొంగ నోట్లు అసలు duplicate అని కనిపెట్ట లేరు అయితే చివరికి కథ ఎలా ముగిసింది అన్నది ఈ వెబ్ series చూడాలి బాగానే ఉంది అక్కడక్కడ కొద్దిగా boaring గా ఉంది 

మొత్తానికి అయితే ఖాళీగా ఉంటే మాత్రం చూడ వచ్చు !!!

4 కామెంట్‌లు:

  1. "తన తాతని ఎలాగైనా అప్పులు బాధ నుండి కాపాడాలని హీరో దొంగ నోట్లు అదే ప్రెస్స్ లో ముద్రిస్తుంటాడు."

    దొంగనోట్లని ముద్రించేవాడు ఒక హీరోనా?
    ఎటుపోతోంది సమాజం?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా ఆకాశానికెత్తెయ్యలా? అంతే, భ్రష్టు పట్టి పోయిన ఆలోచనా విధానాన్ని గొప్పగా చూపించే వాతావరణంలో బతుకుతున్నాం. ఏమన్నా అంటే సినిమా ఒక మెగా వ్యాపారం అంటూ సమర్థించుకుంటున్నారు. ఒకప్పటి సోకాల్జ్ స్వర్ణయుగంలో కూడా సినిమా వ్యాపారమే, ధర్మకార్యమేమీ కాదు, కాకపోతే కొంచెం విలువలు ఉండేవి.

      తొలగించండి
  2. ఇక్కడ హీరో అన్నది సరి అయిన పదం కాదు. Protagonist అని ఉండాలి. Protagonist మంచివాడైనా అవచ్చు, చెడ్డవాడైనా అవచ్చు. ఎప్పుడూ మంచివాళ్ళ మీదే సినిమాలు/కథలు ఉండాలని రూలేంలేదు. సీతారామకళ్యాణం సినిమాలో, సినిమా టైటిల్‌కి సంబంధించని రావణాసురుడుని protagonist గా చూడగలిగినప్పుడు, పుష్ప సినిమాలో సినిమా టైటిల్‌కి సంబంధించిన పుష్పని protagonist గా ఎందుకు చూడలేరు?

    రిప్లయితొలగించండి
  3. తెలుగులో నటులెక్కడున్నారు? అంతా హీరోలే. అందుకే పైపెద్దలు అలా అనివుండొచ్చు.

    రిప్లయితొలగించండి

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...