9, నవంబర్ 2021, మంగళవారం

జయ లలిత బయోపిక్ " తలైవి " సినిమా పై నా అభిప్రాయం !!!

 జయ లలిత బయో పిక్ తలైవి సినిమా జీ5 ott లో అందుబాటులో ఉంది బహుశా మీకు ఇది తెలిసే ఉంటుంది ఇక ఈ సినిమా ఈ రోజు చూడటం జరిగింది ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !

జయ లలిత తమిళ్ నాడు ముఖ్యమంత్రి గానే మనకు తెలుసు కానీ ముఖ్యమంత్రి అవటానికి ముందు అసలు తన జీవితంలో జరిగిన సంఘటనలు,అసలు సినిమాలలో ఉండే జయ లలిత రాజకీయాలలో కి ఎలా వెళ్లారు అన్నది సినిమా కథ 

ఇక ఇందులో జయ లలిత పాత్రలో కంగనా చాలా నటించారు MJR లాగా అరవింద్ స్వామి నటన, సంద్రఖని, నాజర్ ప్రముఖుల పాత్రల్లో బాగా చేశారు ఈ సినిమా చూస్తే నిజంగా జయ లలిత అంత బాగా పాలించారు అనిపించింది వాస్తవాలు ఏమిటో మనకు తెలీదు కానీ సినిమా బయో పిక్ మాత్రం బాగానే ఉంది

అసెంబ్లీ లో జరిగిన జయ లలిత అవమానం సీన్ తో మొదలవుతుంది సినిమా తన చీరను లాగి అవమానించిన అధికార పక్షం శపథం చేసి ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ లో అడుగు పెడతానని అలాగే ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ లో అడుగు పెట్టడం జరుగుతుంది

సినిమా అయితే బాగానే ఉంది ఒక సారి చూడ వచ్చు నేనైతే అసలు జయ లలిత జీవితంలో జరిగిన సంఘటనలు పేపర్ లలో రోజు చదివేవాడిని అలాగే ఉంది సినిమా !!!

1 కామెంట్‌:

  1. ఒక ఆదర్శం ఐన వ్యక్తి జీవితచరిత్రను సినిమాగా మలిచి ప్రజలకు సందేశం ఇవ్వటంలో అర్దం ఉంటుంది. జయలలిత బయోపిక్ ఎందుకు? ఆవిడ బ్రతికి ఉండిన పక్షంలో అవినీతి భాగోతం బట్టబయలైనందుకు జైలుశిక్షను అనుభవిస్తూ ఉండే వారు. ఈబయోపిక్ సినిమాల వెనుక ఉద్దేశం ఫార్ములాగా ప్రముఖు జీవితచరిత్రలను తెరకెక్కించటం కేవలం డబ్బుచేసుకొనే సాదనంగా పనికి వస్తుందనే తప్ప మరే‌ సదుద్దేశమూ కాదు. ఈదేశాన్ని దేవుడే‌ రక్షించాలి - దొంగలను గ్లోరిఫై చేసే సినిమాలకు ఎగబడుతున్నారంటే.

    రిప్లయితొలగించండి

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...