2, నవంబర్ 2019, శనివారం

ఏందిరా ఈ జీవితం !!!

నా జీవితం నాకు ఎప్పుడు నన్ను ఎక్కిరిస్తూనే ఉంటుంది
అన్ని బాగున్నాయి అనే సమయానికి ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం సాధించిన తరువాత ఎదో రకంగా నిలదొక్కుకుంటున్నాం అన్నంత లోపులోనే కుటుంబ ఆర్ధిక సమస్యలు
అదే కాకుండా ఇటీవల పెళ్లి కూడా అయ్యింది ఇంటిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగం లేదు ఉండటానికి చేతి పని ఉన్న దానిలో అన్ని నష్టాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది
ఈ జీవితం మొత్తం ఇలాగే ఉంటుందా అని
ఈ సమస్య నా ఒక్కడికే నేను అనుకోను ఎందుకంటే ఇది ప్రతి మధ్య తరగతి జీవితాల్లో ఉండే సమస్యే

ప్రతి దానికీ ఓర్పు కావలంటారు నిజమే కానీ ఆ ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటినా తరువాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి
ఏదైనా ఒక మంచి ఉద్యోగం కుటుంబ సమస్యలు తలెత్తకుండా మన ఖర్చులకు సంబందించి సంపాదించుకోవడం చాలు ఈ జీవితానికి అంతకు మించి ఏముంది
కానీ అదే ప్రశ్నర్థకం గా మారింది చూద్దాం అంతకు మించి మనం చేసేది ఏమి ఉండదు నాకు తెలిసిన ఒక మంచి మాట ఉంది
" నిరుత్సాహం మనిషిని మరింత బలహీనుణ్ణి చేస్తుంది"

అందుకే సాధ్యమైనంత వరకు నేను నా దగ్గరికి నిరుత్సాహం రాకుండ చూస్తాను అదే నా సమస్యకు
మొదటి పరిష్కారం !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...